BHEL Recruitment 2025 | BHELలో నెలకు రూ.50 వేల జీతంతో 400 ఉద్యోగాలు

BHEL Recruitment 2025 : భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) వివిధ విభాగాల్లో ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసే అభ్యర్థుల పూర్త నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోండి.

పోస్టుల వివరాలు :

BHEL Recruitment 2025 ఈ రిక్రూట్మెంట్ ద్వార మొత్తం పోస్టులు 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీర్ ట్రైనీ పోస్టులు 150, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు 250 ఖాళీలు ఉన్నాయి.

ఇంజనీర్ ట్రైనీ పోస్టులు – 150

మెకానికల్ – 70
ఎలక్ట్రికల్ – 25
సివిల్ – 25
ఎలక్ట్రానిక్స్ – 20
కెమికల్ – 05
మెట్లర్జీ – 05

సూపర్ వైజర్ ట్రైనీ – 250

మెకానికల్ – 140
ఎలక్ట్రికల్ – 55
సివిల్ – 35
ఎలక్ట్రానిక్స్ – 20

విద్యార్హతలు :

BHEL Recruitment 2025

ఇంజనీర్ ట్రైనీ : అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైమ్ డిగ్రీ చేేసి ఉండాలి. లేదా మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్/కెమికల్/మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగాలలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

సూపర్ వైజర్ ట్రైనీ : అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.

జీతం :

BHEL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన ఇంజనీర్ ట్రైనీ అభ్యర్థులకు నెలకు రూ.50 వేలు, సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ.32 వేలు జీతం అందజేస్తారు.

వయస్సు :

BHEL Recruitment 2025 ఇంజనీరింగ్ ట్రైనీ మరియు సూపర్ వైజర్ పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థుల వయస్సు 01 ఫిబ్రవరి 2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

India Post Staff Car Driver Recruitment 2025 | పోస్టాఫీస్ లో డ్రైవర్ ఉద్యోగాలు | 10th పాస్ అయితే చాలు | పరీక్ష లేకుండానే జాబ్

ఎంపిక విధానం :

BHEL Recruitment 2025 ఇంజనీరింగ్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం మరియు ఫీజు :

BHEL Recruitment 2025 కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో అప్లయ్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ ట్రైనీ మరియు సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,072 ఆన్ లైన్ ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.472 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు : BHEL Recruitment 2025

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 01-02-2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 28-02-2025
పరీక్ష తేదీలు : ఏప్రిల్ 11, 12, 13 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.

Full Notification : CLICK HERE

Official Website: CLICK HERE

1 thought on “BHEL Recruitment 2025 | BHELలో నెలకు రూ.50 వేల జీతంతో 400 ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!