BHEL Recruitment 2025 | విద్యుత్ శాఖలో ట్రైనీ జాబ్స్ | 400 పోస్టులు భర్తీ

BHEL Recruitment 2025 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా 400 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. 20 జనవరి, 2025న నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్లు ఫిబ్రవరి 10 నుంచి అందుబాటులోకి వస్తాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జి విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

BHEL Recruitment 2025:

పోస్టుల వివరాలు మరియు అర్హతలు:

ఇంజనీర్ ట్రైనీ : పోస్టులు 150

-మెకానికల్ : 70 పోస్టులు
-ఎలక్ట్రికల్: 25 పోస్టులు
-సివిల్ : 25 పోస్టులు
-ఎలక్ట్రానిక్స్: 20 పోస్టులు
-కెమికల్: 5 పోస్టులు
-మెటలర్జీ: 5 పోస్టులు

BHEL లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు మొత్తం 150 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి Btech, BE,BTech-MTech, BE-ME, MTech, ME చదివి ఉండాలి.

APSSDC Job Mela 2025

APCOS Jobs 2025 

సూపర్ వైజర్ ట్రైనీ: 250 పోస్టులు

-మెకానికల్ : 140 పోస్టులు
-ఎలక్ట్రికల్ : 55 పోస్టులు
-సివిల్: 35 పోస్టులు
-ఎలక్ట్రానిక్స్: 20 పోస్టులు

BHEL లో సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలు మొత్తం 250 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసే అభ్యర్థులు సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.

BHEL Notification 2025:

ముఖ్యమైన తేదీలు:

BHEL Notification Date : 20-01-2025
Online Applications Starts : 02-02-2025
Last Date for Online Applications : 28-02-2025

అప్లికేషన్ ఫీజు:

BHEL లో ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు జనర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.795 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎమ్ అభ్యర్థులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నగదు కార్డు లేదా మొబైల్ వాలెట్, ఐఎమ్ పీఎస్ పద్ధతుల ద్వారా చెల్లింపు చేయవచ్చు.

వయస్సు:

BHEL Notification 2025 ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు మయోపరిమితి 01 జనవరి, 2025 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 27 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ల ప్రాతిపదికన వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

BHEL Notification 2025 ప్రకారం ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Notification & Apply Online : CLICK HERE

1 thought on “BHEL Recruitment 2025 | విద్యుత్ శాఖలో ట్రైనీ జాబ్స్ | 400 పోస్టులు భర్తీ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!