Akhanda-2 : ఇక తాండవమే.. BB4కి క్రేజీ టైటిల్..!

0
8
Akhnada-2

Akhanda-2 : బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటనే ఫ్యాన్స్ కి పూనకాలే.. వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. సింహా, లెజెండ, అఖండ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అఖండ సినిమా అయితే ఒక సంచలనమే అని చెప్పాలి. కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా ఇది.. జనాలు థియేటర్లకు రాని రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది. 

‘అఖండ’ సినిమా వచ్చినప్పటి నుంచే ఈ సినిమా సీక్వెల్ గురించి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూడటం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ‘అఖండ 2’ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. తాజాగా ‘అఖండ 2’ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి  ‘తాండవం’ అని ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో ఈ సినిమాతో బాలయ్య మాస్ తాండవం ఖాయం అని అనుకోవచ్చు. 

ఈ మూవీ కోసం బోయపాటి ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ అఖండ 2 మూవీని చాలా గ్రాండ్ గా తీయబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ‘అఖండ 2’ సినిమాను నిర్మించనున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here