Army DG EME Group C Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో బంపర్ నోటిఫికేషన్ విడులైంది. ఆర్మీలోDG EME గ్రూప్-సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్ మెన్, వెహికల్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, ట్రేడ్స్ మన్ మేట్, వాషర్ మ్యాన్, కుక్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 194 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
Army DG EME Group C Recruitment 2025 Overview
నియామక సంస్థ | Directorate General of Electronics and Mechanical Engineers (DG EME), Indian Army |
పోస్టు పేరు | వివిధ గ్రూప్ – సి పోస్టులు |
పోస్టుల సంఖ్య | 194 |
దరఖాస్తు ప్రక్రియ | 4 అక్టోబర్ – 24 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్, ఇండియన్ ఆర్మీ నుంచి వివిధ గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 194 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
లోయర్ డివిజన్ క్లర్క్ | 39 |
ఫైర్ మెన్ | 04 |
వెహికల్ మెకానిక్, హై స్కిల్డ్-2 | 13 |
ఫిట్టర్ (స్కిల్ కలిగిన) | 04 |
వెల్డర్(స్కిల్ కలిగిన) | 03 |
ట్రేడ్స్ మన్ మేట్ | 62 |
వాషర్ మ్యాన్ | 02 |
కుక్ | 01 |
ఎలక్ట్రీషియన్(పవర్) | 03 |
టెలికామ్ మెకానిక్ | 16 |
అప్ హోల్ స్టర్(స్కిల్డ్) | 03 |
ఫైర్ మెన్ | 07 |
స్టోర్ కీపర్ | 12 |
ఎలక్ట్రీషియన్(స్కిల్డ్ కలిగిన) | 07 |
టిన్ అండ్ కాపర్ స్మిత్(స్కిల్డ్) | 01 |
ఇంజనీర్ ఎక్విప్మెంట్ మెకానిక్(హైలీ స్కిల్డ్) | 01 |
మెషినిస్ట్ (స్కిల్డ్) | 12 |
మొత్తం | 194 |
అర్హతలు :
Army DG EME Group C Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- Lower Division Clerk (LDC) : 12వ తరగతి ఉత్తీర్ణుత + కంప్యూటర్లో ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ వేగం ఉండాలి.
- Storekeeper : కనీస అర్హత 12వ తరగతి పాస్ అయి ఉండాలి.
- Tradesman Mate : 10వ తరగతి ఉత్తీర్ణత చాలు.
- Fireman : 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. అదనంగా ఫైర్ అప్లయెన్సులు, పరికరాల వాడకం మరియు మెయింటెనెన్స్‌లో పరిజ్ఞానం తప్పనిసరి.
- Cook : కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే భారతీయ వంటకాలపై ప్రావీణ్యం ఉండాలి.
- Washerman : అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండి, మిలిటరీ/సివిలియన్ దుస్తులను శుభ్రం చేసే నైపుణ్యం కలిగి ఉండాలి.
- Telephone Operator Grade-II : అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ తప్పనిసరి. అదనంగా PBX బోర్డ్ హ్యాండ్లింగ్‌లో నైపుణ్యం ఉండాలి.
- Electrician (Highly Skilled-II) & Electrician (Power) (Highly Skilled-II) : అభ్యర్థులు 10+2 పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో గుర్తింపు పొందిన ITI సర్టిఫికేట్ ఉండాలి.
- Telecom Mechanic (Highly Skilled-II) : 10+2 పాస్ తో పాటు ITI సర్టిఫికేట్ అవసరం.
- Engineer Equipment Mechanic (Highly Skilled-II) : అభ్యర్థులు 10+2 + ITI Motor Mechanic ట్రేడ్ సర్టిఫికేట్ లేదా B.Sc. (Physics, Chemistry, Mathematics) అర్హత కలిగి ఉండాలి.
- Vehicle Mechanic Armoured (Fighting Vehicle) (Highly Skilled-II) : 10+2 పాస్ అయి, ITI Motor Mechanic ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
- Machinist (Skilled) : అభ్యర్థులు ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి (Machinist, Turner, Mill Wright లేదా Precision Grinder ట్రేడ్‌లో).
- Fitter (Skilled), Welder (Skilled), Upholster (Skilled), Tin and Copper Smith (Skilled) : ఈ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ తప్పనిసరి.
వయోపరిమితి :
Army DG EME Group C Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Army DG EME Group C Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
Army DG EME Group C Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- ఫిజికల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు
జీతం వివరాలు :
Army DG EME Group C Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ఆధారంగా పే లెవల్-2 ప్రకారం రూ.19,900 నుంచి రూ.63,200/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
Army DG EME Group C Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ఉపయోగించి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోండి.
- A4 సైజ్ కాగితంపై ఫారమ్ యొక్క ప్రింట్ తీసుకోండి. టైపింగ్ లేదా చేతితో అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపండి.
- అవసరమైన స్వీయ ధ్రువీకరించబడిన పత్రాలను జత చేయండి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్ మరియు ఎన్ క్లోజర్స్ ని నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కు పోస్టు ద్వారా పంపండి.
- పోస్టు కవర్ పై నిర్ధిష్ట పోస్టు కోసం దరఖాస్తు అని వివరాలు స్పష్టంగా రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24 అక్టోబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : UPSC ESE 2026 Notification | 474 గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి..
3 thoughts on “Army DG EME Group C Recruitment 2025 | ఆర్మీలో గ్రూప్-సి ఉద్యోగాలకు నోటిఫికేషన్”