ARCI Project Scientist Recruitment 2025: భారత ప్రభుత్వ శాస్త్ర & సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ ARCI (International Advanced Research Centre for Powder Metallurgy and New Materials) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ARCI Project Scientist Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ(ARCI) |
పోస్టు పేర్లు | ప్రాజెక్ట్ సైంటిస్ట్-2 మరియు ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 |
పోస్టుల సంఖ్య | 12 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 10 అక్టోబర్, 2025 |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
Also Read : BEML Junior Executive Recruitment 2025 | BEMLలో JE పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
హైదరాబాద్ లో ఉన్న ఇంటర్నేషనల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ(ARCI) ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ARCI Project Scientist Recruitment 2025 ద్వారా పరిశోధన రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆధునిక టెక్నాలజీ, క్లీన్ఎనర్జీ మెటీరియల్స్, బ్యాటరీలు, ఫ్యూయల్ సెల్స్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది.
పోస్టు పేరు | పోస్ట్ కోడ్ | ఖాళీలు |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II | PS – 001 | 1 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II | PS – 002 | 2 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I | PS – 003 | 4 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I | PS – 004 | 4 |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I | PS – 005 | 1 |
అర్హతలు :
ARCI Project Scientist Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు అనేవి మారుతాయి.
Project Scientist – II:
- Ph.D. in Physics/Chemistry/Materials Science
- లేదా M.E/M.Tech/M.S in Metallurgy, Materials Science, Chemical లేదా Mechanical Engineering
- కనీసం 3 సంవత్సరాల R&D అనుభవం (బ్యాటరీ టెక్నాలజీ, మాగ్నెటిక్ మెటీరియల్స్, Large scale production, Cell Fabrication మొదలైన వాటిలో)
Project Scientist – I:
- Ph.D. in Physics/Chemistry/Materials Science/Metallurgy లేదా M.E/M.Tech/M.S in Metallurgy, Materials Science, Chemical, Mechanical, Electrical, EEE, Nano Technology, Ceramics
- 1–2 సంవత్సరాల R&D అనుభవం (Battery Development, Powder Metallurgy, Additive Manufacturing, Electrochemical Testing, Oxide/Ceramic Materials వంటి రంగాల్లో).
వయోపరిమితి :
ARCI Project Scientist Recruitment 2025 పోస్ట్ కోడ్ ని బట్టి వయోపరిమితి మారుతుంది.
- PS – 001 : 55 సంవత్సరాలు
- PS – 002 : 40 సంవత్సరాలు
- PS – 003 : 55 సంవత్సరాలు
- PS – 004 : 35 సంవత్సరాలు
- PS – 005 : 35 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
ARCI Project Scientist Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
ARCI Project Scientist Recruitment 2025 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపిక పూర్తిగా అర్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూకు పిలవబడిన అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్స్ మరియు దరఖాస్తు హార్డ్ కాపీని తీసుకెళ్లాలి.
Also Read : APPSC AEE Recruitment 2025 | రూ.90 వేల జీతంతో గ్రామీణ నీటి సరఫరా శాఖలో AEE పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
ARCI Project Scientist Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | పోస్ట్ కోడ్ | జీతం |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II | PS – 001 | రూ.92,000/- + HRA |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-II | PS – 002 | రూ.67,000/- + HRA |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I | PS – 003 | రూ.77,000/- + HRA |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I | PS – 004 | రూ.65,000/- (అన్ని కలిపి) |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-I | PS – 005 | రూ.56,000/- + HRA |
దరఖాస్తు విధానం :
ARCI Project Scientist Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.arci.res.in/careers లో వెళ్లాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 10 అక్టోబర్,2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్
3 thoughts on “ARCI Project Scientist Recruitment 2025 | ARCIలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్”