APPSC Thanedar Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా థానేదార్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో భర్తీ చేస్తున్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

APPSC Thanedar Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్టు పేరు | థానేదార్ (ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్) |
పోస్టుల సంఖ్య | 10 |
వయోపరిమితి | 18 – 30 సంవత్సరాలు |
దరఖాస్తు ప్రక్రియ | 11 సెప్టెంబర్ – 01 అక్టోబర్ , 2025 |
జీతం | రూ.20,600 – రూ.63,660/- |
Also Read : KCTB Clerk Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులో క్లర్క్ పోస్టులు
ఖాళీల వివరాలు :
APPSC ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో థానేదార్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
డవిజన్ పేరు | ఖాళీలు |
నర్సీపట్నం (ప్లెయిన్) | 01 |
కాకినాడ (ఏజెన్సీ) | 03 |
గిద్దలూరు (ప్లెయిన్) | 01 |
నంద్యాల (ప్లెయిన్) | 01 |
చిత్తూరు వెస్ట్ (ప్లెయిన్) | 01 |
కడప (ప్లెయిన్) | 01 |
చిత్తూరు ఈస్ట్ (ప్లెయిన్) | 01 |
రాజంపేట (ప్లెయిన్) | 01 |
మొత్తం | 10 |
అర్హతలు :
APPSC Thanedar Recruitment 2025 థానేదార్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థులు కూడా దరఖస్తు చేసుకోవచ్చు.
ఫిజికల్ స్టాండర్డ్స్ :
- పురుషులు : కనీసం 163 సెం.మీ ఎత్తు, ఛాతీ 84 సెం.మీ(సాధారణం), 5 సెం.మీ విస్తరణ
- మహిళలు : కనీసం 150 సెం.మీ ఎత్తు, ఛాతీ 79 సెం.మీ(సాధారణం), 5 సెం.మీ విస్తరణ
ఎండూరెన్స్ టెస్ట్ :
- పురుషులు : 4 గంటల్లో 25 కి.మీ నడవాలి.
- మహిళలు : 4 గంటల్లో 16 కి.మీ నడవాలి.
వయోపరిమితి :
APPSC Thanedar Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Thanedar Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ అభ్యర్థులు : రూ.250/- ప్రాసెసింగ్ ఫీజు + రూ.80/- పరీక్ష ఫీజు చెల్లించాలి.
- SC, ST, BC & మాజీ సైనికులకు రూ. 80/- పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
APPSC Thanedar Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో ఉంటుంది.
- రాత పరీక్ష (ఆఫ్ లైన్)
- శారీరక పరీక్ష
- వైద్య పరీక్ష
- తుది ఎంపిక
Also Read : RCF Kapurthala Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో కొత్త నోటిఫికేషన్
జీతం వివరాలు :
APPSC Thanedar Recruitment 2025 ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో థానేదార్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,600 – రూ.63,660/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
APPSC Thanedar Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెట్ సైట్ ని సందర్శించాలి.
- వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిషన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 11 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 01 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : MANUU Recruitment 2025 | నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
3 thoughts on “APPSC Thanedar Recruitment 2025 Notification | ఏపీలో థానేదార్ పోస్టులకు బంపర్ నోటిఫికేషన్”