AP Union bank Jobs 2025 | ఏపీలో 549.. తెలంగాణాలో 304  యూనియన్ బ్యాంక్ జాబ్స్

Union Bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది.  దేశవ్యాప్తంగా 2691 అప్రెంటీస్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూనియన్ బ్యాంక్ నుంచి విడుదలైన పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 549 పోస్టులు మరియు తెలంగాణలో 304 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 05వ తేేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టుల వివరాలు : 

Union Bank Apprentice Jobs : యూనియన్ బ్యాంక్ నుంచి విడుదలైన అప్రెంటీస్ పోస్టులు మొత్తం 2691 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా భారీగా పోస్టులు అయితే ఉన్నాయి.

● ఆంధ్రప్రదేశ్ – 549

● తెలంగాణ – 304

NTPC Assistant Executive Recruitment 2025 | NTPC లో 400 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

విద్యార్హతలు : 

Union Bank of India Apprentice  Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్ స్టిట్యూట్ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 01-04-2021 లేదా తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయస్సు : 

Union Bank of India Apprentice  Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 01 ఫిబ్రవరి 2025 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

Union Bank of India Apprentice  Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.800/-, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు రూ.600/-, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.400/- ఫీజు నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

జీతం : 

Union Bank of India Apprentice  Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో రూ.15,000/- స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 

ఎంపిక ప్రక్రియ : 

Union Bank of India Apprentice  Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింద దశల్లో జరుగుతుంది. 

● ఆన్ లైన్ రాత పరీక్ష

● నాలెడ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్

● మెడికల్ ఎగ్జామినేషన్

రాత పరీక్ష విధానం: 

Union Bank of India Apprentice  Recruitment 2025 ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 60 నిమిషాల సమయం ఇస్తారు. 

● జనరల్ / ఫైనాన్షియల్ అవేర్ నెస్ – 25 మార్కులు

● క్వాంపిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ – 25 మార్కులు

● కంప్యూటర్ నాలెడ్జ్ – 25 మార్కులు

● జనరల్ ఇంగ్లీష్ – 25 మార్కులు

దరఖాస్తు విధానం : 

Union Bank of India Apprentice  Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 05 తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు సమర్పించుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు : 

● ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 – 02- 2025

● ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 05 – 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Official Website :  CLICK HERE

2 thoughts on “AP Union bank Jobs 2025 | ఏపీలో 549.. తెలంగాణాలో 304  యూనియన్ బ్యాంక్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!