AP SSC Hall tickets Download 2025 ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేశారు. ఏపీలో మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. దీంతో పదో తరగతి హాల్ టికెట్లను ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఈ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదు మన మిత్ర వాట్సాప్ నెంబర్ నుంచి కూడా హాల్ టికెట్లను సులభంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మిన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 నెంబర్ ను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా కూడా సులభంగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
How to Download AP SSC Hall Tickets 2025
పదో తరగతి పరీక్ష హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే పద్ధతి
పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ కింది పద్ధతులను అనుసరించాలి.
- హాల్ టికెట్ కోసం https://www.bse.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.
- SSC Public Examination – 2025 Hall tickets పై క్లిక్ చేయండి.
- అప్లికేషన్ నంబర్ లేదా స్కూల్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత హాల్ టికెట్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
How to Download SSC Hall Ticket in Whatsapp
వాట్సాప్ లో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసే పద్ధతి
- ఏపీ గవర్నమెంట్ పెట్టిన వాట్సాప్ నెంబర్ 9552300009 మీ మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
- మీ వాట్సాప్ లో ఆ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేస్తే కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది.
- విద్యా సేవలు అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
- SSC హాల్ టికెట్ ఆప్షన్ ని సెలక్ట్ చేసుకోవాలి.
- అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
- వెంటనే హాల్ టికెట్ మీ వాట్సాప్ నెంబర్ కు వచ్చేస్తుంది.
ఏపీ పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్
తేదీ | సబ్జెక్ట్ |
మార్చి 17 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 |
మార్చి 19 | సెకండ్ లాంగ్వేజ్ |
మార్చి 21 | ఇంగ్లీష్ |
మార్చి 22 | ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ -2 |
మార్చి 24 | మేథమేటిక్స్ |
మార్చి 26 | ఫిజికల్ సైన్స్ |
మార్చి 28 | బయోలాజికల్ సైన్స్ |
మార్చి 29 | మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 |
మార్చి 31 లేదా ఏప్రిల్ 1 | సోషల్ స్టడీస్ |