AP SSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ విడుదల చేస్తుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు జరిగాయి. ఈ ఏడాది పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశాలు.
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ మరియు ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు రిలీజ్ అవుతాయి. విద్యార్థులు పరీక్షల ఫలితాలను ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో మనమిత్ర నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను చూసుకోవచ్చు. ఏపీ ఓపెన్ స్కూల్ ఫలితాలను https://apopenschool.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
AP SSC 10th Class Results 2025 Release
గతంలో ఫలితాలు చూసుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడేవారు. ఆ ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ నెంబర్ ను తీసుకొచ్చింది. ఆ నెంబర్ ద్వారా చాలా సింపుల్ గా మన మొబైల్ లోనే ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకునే రెండు పద్ధతులను కింద ఇచ్చాము. దానిని ఫాలో అయ్యి మీ ఫలితాలు చూసుకోవచ్చు.
How to Check AP SSC Results 2025 :
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. ఏపీ అధికారిక వెబ్ సైట్ మరియు వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకోవడానికి విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఫలితాలకు సంబంధించి పీడీఎఫ్ కాపీలను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ ఫలితాలను కూడా విడుదల చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నారు. ఓపెన్ స్కూల్ ఫలితాలను https://apopenschool.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
AP SSC Results 2025 check with Website:
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.
- AP SSC Results 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- అంతే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ఫలితాలను పీడీఎఫ్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
AP SSC Results 2025 Check with Whatsapp :
- మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ను సేవ్ చేసుకుని, వాట్సాప్ లో ‘HI’ అని మెసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ‘సర్వీస్ ఎంచుకోండి’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
- Download AP SSC Results 2025 పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఫలితాలు మీ వాట్సాప్ లో ప్రత్యక్షమవుతాయి.
- ఫలితాలను పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Open School Results 2025 :
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు గత మార్చిలో జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక పబ్లిక్ పరీక్షలతో పాటే ఓపెన్ స్కూల్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయనుంది. ఓపెన్ స్కూల్ 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఓపెన్ ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి https://apopenschool.ap.gov.in సందర్శించి ఫలితాలు చూసుకోవచ్చు.