AP Private Schools RTE Admissions Notification 2025 ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ (అన్ ఎయిడెడ్ ) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్థుల అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు అన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించింది.
విద్యాహక్కు చట్టం – 2009, సెక్షన్ 12(1)సీ అమలులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో IB / CBSE / ICSE / స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు బలహీన వర్గాలకు చెందిన పిల్లల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఆ పిల్లలకు సీట్లు కేటాయిస్తుంది.
AP Private Schools RTE Admissions Notification 2025
దరఖాస్తు విధానం:
విద్యార్థులు తమ ఆధార్ కార్డు ద్వారా ప్రాథమిక వివరాలతో https://cse.ap.gov.in/ వెబ్ సైట్ నందు కేటాయింపు చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ సచివాలయం / మండల విద్యా వనరుల కేంద్రం / సంబంధిత పాఠశాల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర విషయాల కోసం సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు. సంప్రదించడానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కేటాయించారు. 18004258599 నెంబర్ ను సంప్రదించవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్:
1.ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కోసం : తల్లిదండ్రుల ఆధార్ కార్డు / ఓటర్ కార్డు / రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక / MGNERGS జాబ్ కార్డు / పాస్ పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ / విద్యుత్ బిల్లు / రెంటల్ అగ్రిమెంట్ కాపీ.
2.పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం.
3.అర్హత వయస్సు:
- IB / CBSE / ICSE పాఠశాలల్లో ప్రవేశం కోసం 31.03.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- స్టేట్ సిలబస్ పాఠశాలలో ప్రవేశం కోసం 01.06.2025 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
సీట్ల కేటాయింపు:
- అనాథ పిల్లలు, హెచ్ఐవి బాధితుల పిల్లలు, దివ్యాంగులు – 5%
- ఎస్సీలకు – 10%
- ఎస్టీలకు – 4%
- బలహీన వర్గాలకు (బీసీ, మైనార్టీ, ఓసీ) చెందిన పిల్లలకు – 6% సీట్లు
నోటిఫికేషన్ షెడ్యూల్ :
కార్యాచరణ | షెడ్యూల్ |
ప్రవేశాల కోసం కార్యాచరణ జారీ చేసిన తేదీ | 17 – 04 – 2025 |
IB / CBSE / ICSE / స్టేట్ సిలబస్ ను అనుసరించే అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు పోర్టల్ లో నమోదు చేసుకోవడం | 19 – 04 – 2025 నుంచి 26 – 04 – 2025 |
విద్యార్థుల నమోదు కోసం పోర్టల్ అందుబాటులో ఉంచడం | 28 – 04 – 2025 నుంచి 15 – 05 – 2025 |
గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ డేటా ద్వారా విద్యార్థుల ప్రవేశానికి అర్హతను నిర్ణయించడం | 16 – 05 – 2025 నుంచి 20 – 05 – 2025 |
మొదటి విడత లాటరీ ఫలితాల ప్రచురణ | 21 – 05 – 2025 నుంచి 24 – 05 – 2025 |
పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ | 02 – 06 – 2025 |
రెండో విడత లాటరీ ఫలితాల ప్రచురణ | 06 – 06 – 2025 |
పాఠశాలల వారీగా విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ | 12 – 06 – 2025 |
- Notification : CLICK HERE