AP Prisons Department Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోపు దరఖాస్తులు ఆఫ్ లైన్ లో సమర్పించుకోవాలి.
AP Prisons Department Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ |
పోస్టు పేరు | సోషల్ వర్కర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ |
ఖాళీల సంఖ్య | 14 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
జీతం | నెలకు రూ.10,000 – రూ.30,000/- |
జాబ్ లొకేషన్ | నెల్లూరు, కడప |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన మాధకద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికా పథకం కింద కడపలోని సెంట్రల్ ప్రిజన్ మరియు నెల్లూరులోని సెంట్రల్ జైలులో ఉన్న డి-అడిక్షన్ సెంట్రల్ లో తాత్రాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సోషల్ వర్కర్ మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | కడప సిపి ఖాళీలు | నెల్లూరు సిపి ఖాళీలు |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ | 01 | 01 |
అకౌంట్ కమ్ క్లర్క్ | 01 | 01 |
కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ / కమ్యూనిటీ వర్కర్ | 02 | 02 |
నర్స్(పురుషుడు) | 01 | 01 |
వార్డు బాయ్ | 01 | 01 |
పీర్ ఎడ్యుకేటర్ | 01 | 01 |
అర్హతలు :
AP Prisons Department Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ / అకౌంటెంట్ మరియు క్లర్క్ / కౌన్సిలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ / కమ్యూనిటీ వర్కర్ : గ్రాడ్యుయేషన్
- నర్స్ (పురుషుడు) : GNM/ BSc, నర్సింగ్ డిగ్రీ
- వార్డ్ బాయ్ : 8వ తరగతి
- పీర్ ఎడ్యుకేటర్ : నిబంధనల ప్రకారం
వయస్సు :
AP Prisons Department Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
AP Prisons Department Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
AP Prisons Department Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
AP Prisons Department Recruitment 2025 పోస్టులను బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
పోస్టు పేరు | జీతం |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ | రూ.30,000/- |
అకౌంటెంట్ కమ్ క్లర్క్ | రూ.18,000/- |
కౌన్సెలర్ / సోషల్ వర్కర్ / సైకాలజిస్ట్ / కమ్యూనిటీ వర్కర్ | రూ.25,000/- |
నర్స్ (పురుషుడు) | రూ.20,000/- |
పీర్ అధ్యాపకుడు | రూ.10,000/- |
దరఖాస్తు విధానం :
AP Prisons Department Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు పూర్తి వివరాలతో తమ CV ని కింద అడ్రస్ కి పోస్టు ద్వారా పంపాలి.
- అడ్రస్: డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రాగ్నే, కొల్లిస్ రెసిడెన్సీ, 7వ లేన్, రాజ రాజేశ్వరీ నగర్, ఆశ్రమ రోడ్డు, తాడేపల్లి, గుంటూరు జిల్లా – 522501
- లేదా digprisonsgnt@gmail.com మెయిల్ కి పంపాలి.
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 10 – 09 – 2025
Notification | Click here |
Official Website | Click here |