AP polavaram Project Jobs 2025 ఏపీలోని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఆర్ & ఆర్ కార్యాలయాల్లో పనిచేయడానికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
AP Polavaram Project Jobs 2025
పోస్టుల వివరాలు :
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నఆర్ & ఆర్ కార్యాలయాలు, రంపచోడవరం, ఏటపాక, చింతూరులో విధులు నిర్వర్తించడానికి ఆవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 06
పోస్టు పేరు | ఖాళీలు |
సీనియర్ అసిస్టెంట్ | 01 |
వర్క్ ఇన్ స్పెక్టర్ | 02 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 02 |
ఆఫీస్ సబార్డినేట్ | 01 |
అర్హతలు :
AP polavaram Project Jobs 2025 ఉద్యోగాలు పోస్టును అనుసరించి అర్హతలు మారుతాయి.
పోస్టు పేరు | అర్హతలు |
సీనియర్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ |
వర్క్ ఇన్ స్పెక్టర్ | సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా బీటెక్ |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | BCA / MCA లేదా కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్స్ లో డిగ్రీ |
ఆఫీస్ సబార్డినేట్ | 10వ తరగతి |
Note : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయస్సు :
AP polavaram Project Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18-09-2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
AP polavaram Project Jobs 2025 పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
AP polavaram Project Jobs 2025 పోస్టులకు కింది దశలలో ఎంపిక చేేస్తారు.
పోస్టు పేరు | ఎంపిక ప్రక్రియ |
సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్ స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ | రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ |
ఆఫీస్ సబార్డినేట్ | విద్యార్హతలో మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా |
జీతం :
AP polavaram Project Jobs 2025 పోస్టులకు ఎంపికైన వారికి జీతం ఎంత ఇస్తారనే వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం చెల్లించడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AP polavaram Project Jobs 2025 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టెడ్ చేయించి కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
కావాల్సిన ధ్రువపత్రాలు:
- విద్యార్హత సర్టిఫికెట్లు
- స్టడీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
- రెసిడెన్స్ సర్టిపికెట్
- ఆధార్ కార్డు
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఇతరములు
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:
ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీ.ఆర్.పీ గెస్ట్ హౌస్, ధవళేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్.
- దరఖాస్తులకు చివరి తేేదీ : 07 – 04 – 2025
Notification : CLICK HERE