ఈ రోజుల్లో చాలా మందికి చదువుకున్నా కూడా ఉద్యోగం దొరకడం కష్టం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువతలో నిరాశ పెరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఒక దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం పేరు ‘కౌశలం సర్వే’. ఈ కౌశలం సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యో అవకాశాలను కల్పించడమే, స్కిల్స్ కూడా అందిస్తారు. ఇది కేవలం సర్వే మాత్రమే కాదు, భవిష్యత్తు జీవితాన్ని మార్చే ఒక మంచి అవకాశం.
కౌశలం సర్వే అంటే ఏమిటి?
కౌశలం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతపై పూర్తి సమాచారం సేకరిస్తారు. ఎవరు ఏ చదువు చేశారు, ఏ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకొని, ఆ ఆధారంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ముందుగా దీనిని “వర్క్ ఫ్రం హోమ్ సర్వే” అని పిలిచేవారు.

అర్హతలు ఎవరికీ?
ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యువత కోసం మాత్రమే. 10వ తరగతి పాస్ అయినవారు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, పీహెచ్‌డీ చేసిన వారందరూ ఇందులో నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు, 10వ తరగతి పూర్తి చేయని వారు కూడా తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చు. వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
సర్వే ఎలా జరుగుతుంది?
ఈ సర్వేను గ్రామ/వార్డు సచివాలయం ద్వారా నిర్వహిస్తారు. మీరు మీ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, వయసు ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సచివాలయంలో ఉన్న సిబ్బంది మీ వివరాలను కౌశలం మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా భవిష్యత్తులో మీకు తగిన ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి.
కౌశలం సర్వే ద్వారా లాభం ఏంటీ?
కౌశలం సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువకుడి సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. దీని ఆధారంగా ఎవరు ఏ ఉద్యోగానికి అర్హులనే దానిని స్పష్టంగా గుర్తిస్తారు. తర్వాత వారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగ నోటిఫికేషన్లు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుతాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభిస్తాయి.
సర్వేకి చివరి తేదీ?
కౌశలం సర్వేలో పాల్గొనడానికి అభ్యర్థులకు 25 ఆగస్టు, 2025 తేదీగా నిర్ణయించారు. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ సర్వేలో పాల్గొని తమ పేర్లు రిజిస్టర్ చేసుకోండి.
గ్రామ/వార్డు సచివాలయాల పాత్ర కీలం
కౌశలం సర్వేలో గ్రామ లేదా వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. సచివాలయాల దగ్గరే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, సర్టిఫికెట్లు అన్ని సేకరించి కౌశలం యాప్ లో అప్ లోడ్ చేస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వివరాలు ఒకే చోట సెంట్రలైజ్ అవుతాయి.

కౌశలం సర్వే లక్ష్యం
ఈ పథకం వెనక ఒకే ఒక ఉద్దేశ్యం ఉంది. అదే ఏమిటంటే—ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ—ఎక్కడైనా ఖాళీలు వస్తే, సర్వేలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు నోటిఫికేషన్లు పంపబడతాయి. అదేవిధంగా భవిష్యత్తులో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు కూడా అందిస్తారు.
అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- 10వ తరగతి మార్కుల మెమో
- డిగ్రీ/డిప్లొమా/పీజీ సర్టిఫికెట్లు
- వయసు ధ్రువీకరణ పత్రం
ముగింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కౌశలం సర్వే పథకం నిజంగా నిరుద్యోగులకు ఒక వెలుగు. ఇది కేవలం ఉద్యోగం కోసం కాదు, భవిష్యత్తు కోసం ఒక మార్గం. మీరు అర్హులు అయితే ఆలస్యం చేయకుండా దగ్గరలోని సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపటి ఉద్యోగం, రేపటి భవిష్యత్తు మీకోసం సిద్ధంగా ఉంది.
Disclaimer
ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం అధికారిక నోటిఫికేషన్లు, వార్తా మూలాల ఆధారంగా మాత్రమే అందించబడింది. పూర్తి మరియు ఖచ్చితమైన వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా గ్రామ/వార్డు సచివాలయం సంప్రదించాలి.