AP Inter Supplementary Exam Results 2025 ఆంధ్రప్రదేశ్ లో Inter Supplementary Exams సజావుగా జరిగాయి. మే 12వ తేదీన ప్రారంభమైన పరీక్షలు మే 20వ తేదీన ముగిశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కలిపి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇంప్రూవ్ మెంట్ కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వారం లేదా పది రోజుల్లో విడుదల చేయడానికి ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
AP Inter Supplementary Exam Results 2025 Release Date :
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 – 20వ తేదీ వరకు జరిగాయి. వెంటనే పరీక్షల మూల్యాంకనం కూడా అధికారులు జరుపుగుతున్నారు. పరీక్షల మూల్యాంకనం త్వరగా పూర్తి చేసి మే 30వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంటర్ ఫెయిల్ అయిన వారు మాత్రమే కాకుండా.. మార్కులు పెంచుకోవడం కోసం పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు https://www.bieap-gov.org/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
How to Check AP Inter Supplementary Exam Results 2025 :
- బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://www.bieap-gov.org/ ఓపెన్ చేయాలి.
- అక్కడ AP Inter Supplementary Exam 2025 Results పై క్లిక్ చేయాలి.
- విద్యార్థుల హాల్ టికెబ్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే వెంటనే ఫలితాలు కనిపిస్తాయి.
- ఫలితాల పీడీఎఫ్ కాపీని ప్రింట్ లేదా డౌన్ లోడ్ చేసుకోండి.