AP Inter Results 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. నేరుగా మీ వాట్సాాప్ కే

AP Inter Results 2025 ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేడ్ అయితే రావడం జరిగింది. ఏపీలో ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇంటర్ పరీక్షల మూల్యాంకనం చేస్తున్నారు. ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

AP Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ మూల్యాంకనం పూర్తవుతుంది. మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్యూటరీకరణ కోసం ఒక వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కంప్యూటరీకరణ తర్వాత అధికారులు పరిశీలించి ఫలితాలను విడుదల చేస్తారు.

AP Inter Results 2025 విడుదల ఎప్పుడంటే: 

ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12 – 15 తేదీల మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఈసారి నేరుగా వాట్సాప్ కే ఫలితాలు: 

AP Inter Results 2025: ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు చూసుకునేందుకు చాలా సులభతరం చేేసింది. గతంలో ఇంటర్ పరీక్షల ఫలితాల తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను సందర్శించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్టుగా మీ మొబైల్ వాట్సాప్ కే ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ను తీసుకొచ్చింది. విద్యార్థుల మార్కలను పీడీఎఫ్ రూపంలో తయారు చేసి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఈ షార్ట్ పీడీఎఫ్ మార్కు మెమోలను విద్యార్థులుు ప్రవేశ పరీక్షల కోసం ఉపయోగించుకోవచ్చు. 

రెండు పద్ధతుల్లో ఫలితాలు :

AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను రెండు పద్ధతుల్లో చూసుకోవచ్చు. ఏపీ అధికారిక వెబ్ సైట్  లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా అధికారిక వెబ్ సైట్ Bse.Ap ఫలితాలను చేసుకోవచ్చు. 

వాట్సాప్ ద్వారా ఫలితాలు ఎలా తెలుసుకోవాలి: 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన వివిధ పౌర సేవలను సులభవంగా మరియు సమర్థవంతంగా అందించేందుకు మన మిత్ర(వాట్సాప గవర్నెన్స్) ని తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా విద్యార్థులు కూడా తమ సేవలను ఉపయోగించుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్ ఫలితాలను వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. 

  • మొదటగా 9552300009 అనే నెంబర్ ను మన సేవ్ చేసుకోవాలి. 
  • వాట్సాప్ లో వివిధ రకాల సేవలు ఉంటాయి. విద్యాసేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి 
  • అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. 
  • ఫలితాలను PDF రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. 

Leave a Comment

Follow Google News
error: Content is protected !!