ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BIEAP) 2026 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం వార్షిక పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈసారి పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24, 2026 వరకు జరగనున్నాయి. ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి పరీక్షలు నిర్వహించబడతాయి.
ఈ షెడ్యూల్ ప్రకారం, ఇంటర్ 1వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు, ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు జరుగుతాయి. ఈ తేదీల ప్రకటనతో విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవచ్చు.
ప్రాక్టికల్ పరీక్షలు :
ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్ కోర్సులకు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉంటాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ లో ఉంటాయి. అయితే ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే. అవసరమైతే షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.
AP Intermediate 1st Year Time Table 2026
- Feb 23, 2026 – Telugu / Sanskrit / Urdu / Hindi / Tamil / Oriya / Kannada / Arabic / French / Persian – Paper I
- Feb 25, 2026 – English Paper I
- Feb 27, 2026 – History Paper I
- Mar 2, 2026 – Mathematics Paper I
- Mar 5, 2026 – Biology Paper I
- Mar 7, 2026 – Economics Paper I
- Mar 10, 2026 – Physics Paper I
- Mar 12, 2026 – Commerce Paper I
- Mar 14, 2026 – Civics Paper I
- Mar 17, 2026 – Chemistry Paper I
- Mar 20, 2026 – Public Administration / Logic Paper I
- Mar 24, 2026 – Modern Language / Geography Paper I
AP Intermediate 2nd Year Time Table 2026
- Feb 24, 2026 – 2nd Language Paper II
- Feb 26, 2026 – English Paper II
- Feb 28, 2026 – Botany / History Paper II
- Mar 3, 2026 – Mathematics Paper IIA / Civics Paper II
- Mar 6, 2026 – Zoology / Economics Paper II
- Mar 9, 2026 – Mathematics Paper IIB
- Mar 11, 2026 – Commerce / Sociology / Fine Arts, Music Paper II
- Mar 13, 2026 – Physics Paper II
- Mar 16, 2026 – Modern Language / Geography Paper II
- Mar 18, 2026 – Chemistry Paper II
- Mar 23, 2026 – Public Administration / Logic Paper II