AP Forest Department Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APSPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 691 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జులై 16వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
AP Forest Department Jobs 2025 Overview:
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్ట్ పేరు | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 691 |
దరఖాస్తు ప్రక్రియ | 16 జులై – 5 ఆగస్టు, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అర్హతలు | 12వ తరగతి |
వయస్సు | 18 నుంచి 30 సంవత్సరాలు |
జీతం | రూ.23,120 – రూ.80,910/- |
పోస్టుల వివరాలు :
అటవీశాఖలో ఖాళీల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 691 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ | 256 |
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ | 435 |
అర్హతలు :
AP Forest Department Jobs 2025 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
- 12వ తరగతి ఉత్తీర్ణత
- ఎత్తు : పురుషులు 163 సెం.మీ, మహిళలు 150 సెం.మీ
- ఛాతీ : పురుషులు 84 సెం.మీ, మహిళలు 79 సెం.మీ.
వయస్సు :
AP Forest Department Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AP Forest Department Jobs 2025 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జనరల్ అభ్యర్థులు : రూ.250(అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు) + రూ.80(పరీక్ష ఫీజు)
- SC / ST / BC / PWD / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
AP Forest Department Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ కింది దశలలో జరుగుతుంది.
- స్క్రీనింగ్ టెస్ట్
- మెయిన్ ఎగ్జామినేషన్
- ఫిజికల్ ఎగ్జామినేషన్
- కంప్యూటర్ ప్రొఫెషియెన్సీ టెస్ట్
జీతం వివరాలు :
AP Forest Department Jobs 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ : రూ.25,220 – రూ.80,910/-
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ : రూ.23,120 – రూ.74,770/-
దరఖాస్తు విధానం :
AP Forest Department Jobs 2025 అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ఇంతకు ముందు రిజిస్టర్ చేసుకుని ఉంటే, యూజర్ ఐడీ మరియు పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 05 ఆగస్టు, 2025
Notification | Click here |
Official Website | Click here |