AP District Court Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా హెడ్ క్లర్క్, అటెండర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరియు స్టెనో కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో అప్లికేషన్లు సమర్పించుకోవాలి

పోస్టుల వివరాలు :
AP District Court Notification 2025 ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు నుంచి రిలీజ్ అయ్యింది. అయితే ఈ పోస్టులకు అన్ని జిల్లాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాట్రాక్ట్ పద్ధతిలో హెడ్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టెనో కమ్ టైపిస్ట్ మరియు అటెండర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీలు :
పోస్టు పేరు | ఖాళీలు |
హెడ్ క్లర్క్ | 3 |
జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ | 3 |
స్టెనో కమ్ టైపిస్ట్ | 2 |
అటెండర్ | 3 |
మొత్తం | 11 |
అర్హతలు :
AP District Court Notification 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- హెడ్ క్లర్క్ : ఏదైనా డిగ్రీ ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
- స్టెనో కమ్ టైపిస్ట్ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత + షార్ట్ హ్యాండ్ (ఇంగ్లీష్ హైయర్ లేదా లోయర్) + టైప్ రైటింగ్ (ఇంగ్లీష్ హైయర్ లేదా లోయర్)
- జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ + టైపింగ్ (ఇంగ్లీస్ హైయర్ లేదా లోయర్)
- అటెండర్ : 7వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి :
AP District Court Notification 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AP District Court Notification 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
AP District Court Notification 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
- మెరిట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : AP Grama Sachivalayam Notification 2025 | 2,778 కొత్త పోస్టులకు ఆమోదం
జీతం వివరాలు :
AP District Court Notification 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- హెడ్ క్లర్క్ పోస్టులకు : నెలకు రూ.44,570/-
- స్టెనో కమ్ టైపిస్ట్ : నెలకు రూ.25,220/-
- జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : రూ.34,580/-
- అటెండర్ పోస్టులకు : రూ.20,000/-
దరఖాస్తు విధానం :
AP District Court Notification 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు జత చేసి, కింది అడ్రస్ కి సెప్టెంబర్ 12వ తేదీ లోపు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సి అడ్రస్ :
- ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వెస్ట్ గోదావరి, ఏలూరు
దరఖాస్తులకు చివరి తేదీ : 12 సెప్టెంబర్, 2025 సాయంత్రం 05:00 లోపు
Notification | Click here |
Official Website | Click here |
Also Read : హైదరాబాద్ లోని CDFDలో టెక్నికల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు