తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే..
‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. ఈ ఈవెంట్ లో యాంకర్.. కార్తీతో మాట్లాడుతూ లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. ‘లడ్డూ టాపిక్ వద్దు..ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్’ అంటూ కామెంట్ చేశారు. లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు.
హీరో కార్తీ చేసిన ఈ వ్యాాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని కార్తీ అనడం సరైనది కాదని, కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఇలా మరో సారి అనవద్దని, ఓ నటుడిగా కార్తీ అంటే తనకు గౌరవమని చెప్పారు. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదని, సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలని కోరారు.