AP CID Home Guard Notification 2025 | ఏపీలో హోమ్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP CID Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)లో హోమ్ గార్డ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు ఎటువంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఆసక్తి,  అర్హత ఉన్న అభ్యర్థులు ఏపీ హోమ్ గార్డ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాదు ఈ సంవత్సరం హోమ్ గార్డ్ ఉద్యోగాలకు జీతాలు కూడా పెంచారు. ఇది మంచి అవకాశం కాబట్టి అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

AP CID Home Guard Notification 2025

పోస్టుల వివరాలు: 

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) నుంచి హోమ్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 28 హోమ్ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మంగళగిరిలోని CID హెడ్ ఆఫీస్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు,  తిరుపతి, కర్నూలులో పనిచేయాల్సి ఉంటుంది. 

పోస్టు పేరు ఖాళీలు
Home Guard (Category – B – Technical & Other Trades)28

అర్హతలు: 

AP CID Home Guard Notification 2025 హోమ్ గార్డ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  

  • 10+2 లేదా తత్సమాన అర్హతలు ఉండాలి. 
  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి(MS Office, Internet, Typing, etc.)
  • లైట్/హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 
  • శారీరకంగా మరియు మానసికంగా ఫిట్ గా ఉండాలి.  

ఫిజికల్ స్టాండర్డ్స్ :  

  • పురుష  అభ్యర్థులు 160 సెం.మీ. ఎత్తు ఉండాలి.
  • మహిళ అభ్యర్థులు 150 సె.మీ. ఎత్తు ఉండలి. (SC మహిళలకు 145 సెం.మీ)

Preferred Qualification : BCA / BSc (Computers) / MCA / B.Tech (Computers) లేదా ఇతర ఐటీ అర్హతలు ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

వయస్సు: 

AP CID Home Guard Notification 2025 హోమ్ గార్డ్ పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: 

AP CID Home Guard Notification 2025 హోమ్ గార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఫిజికల్ మెస్యూర్మెంట్ టెస్ట్ పెడతారు. ఫిజికల్ మెస్యూర్మెంట్ టెస్ట్ లో అర్హత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 

  • దరఖాస్తుల పరిశీలన
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఫిజికల్ మెస్యూర్మెంట్ టెస్ట్
  • స్కిల్ టెస్ట్ 

స్కిల్ టెస్ట్ : 

స్కిల్ టెస్ట్ లో రెండు పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మరియు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 

  • కంప్యూటర్  నాలెడ్జ్ టెస్ట్ : MS Office, Internet Browsing, Typing, Drafting Skills, Other Computer Applications లో ప్రావీణ్యం
  • డ్రైవింగ్ టెస్ట్ : ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది.

జీతం : 

AP CID Home Guard Notification 2025 హోమ్ గార్డ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రోజుకు రూ.710/- డ్యూటీ అలవెన్స్ ఇస్తారు.  అంటే నెలకు రూ.21,300/- జీతం లభిస్తుంది. 

దరఖాస్తు విధానం: 

AP CID Home Guard Notification 2025 హోమ్ గార్డ్ పోస్టులకు నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మే 1వ తేదీ నుంచి మే 15 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకుని, దానిలో పూర్తి వివరాలను పూరించాలి. అప్లికేషన్ తో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి కింది చిరునామాకు పంపించాలి. 

అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్: 

The Director General of Police, Crime Investigation Department, Andhra Pradesh, AP Police Headquarters, Mangalagiri – 522503

కావాల్సిన డాక్యుమెంట్స్:

అభ్యర్థులు అప్లికేషన్ తో పాటు కింద ఇచ్చిన సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. 

  • అప్లికేషన్
  • 10 తరగతి సర్టిఫికెట్ (వయస్సు నిర్ధారణ కోసం)
  • ఇంటర్ సర్టిఫికెట్
  • మిగతా విద్యార్హత సర్టిఫికెట్లు
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • లైట్ లేదా హెవీ డ్రైవింగ్ లైసెన్స్
  • కంప్యూటర్ సర్టిఫికేషన్స్
  • రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు
  • ఇతర టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులు ప్రారంభ తేదీ01 – 05 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ15 – 05 – 2025
Notification & ApplicationCLICK HERE
Official WebsiteCLICK HERE

11 thoughts on “AP CID Home Guard Notification 2025 | ఏపీలో హోమ్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!