What to Study After 10th: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు ఇటీవల ముగిశాయి. అయితే 10వ తరగతి అయిపోయిన వెంటనే ఏం చేదవాలి? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఆ మా ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ ఎంపీసీ తీసుకుంటున్నారు.. ఇంటర్ బైపీసీ తీసుకుంటున్నారు.. నేను కూడా అదే తీసుకుంటాను అని ప్రతి విద్యార్థి చెప్పే మాట. విద్యార్థులు వారి ఫ్రెండ్స్ బాటలో వెళ్తారు తప్ప.. పదో తరగతి పూర్తయిన తర్వాత అసలు ఏం చదవాలి అనే నాలెడ్జ్ విద్యార్థులకు ఉండదు. చాలా మంది పేరెంట్స్ కూడా తమకు తెలిసిన వారిని అడిగుతారు.. మా వాడికి ఏం చదివించాలి.. అని..అలా మీరు కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు.. ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది.. ప్రవేశ పరీక్షలు ఏముంటాయి.. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి.
Career Plan After 10th :
- డిప్లొమా కోర్సులు
- పాలిటెక్నిక్ కోర్సులు
- మెడికల్ అండ్ పారామెడికల్ కోర్సులు
- ఐటీఐ కోర్సులు
- ఇంటర్మీడియట్ కోర్సులు
- ఉద్యోగ అవకాశాలు
Diploma Courses After 10th :
డిప్లొమాలో ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు సాధారణంగా తక్కువ వ్యవధిలోనే ఉంటాయి.
డిప్లొమా | కోర్సు వ్యవధి | కోర్సు అవకాశాలు |
ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా | 3 సంవత్సరాలు | -ఫ్యాషన్ డిజైనర్-కాస్ట్యూమ్ డిజైనర్-టెక్స్ టైల్ డిజైనర్-బ్రైడ్ డ్రెస్ డిజైనర్-ఫ్యాషన్ స్టయిలిస్ట్ |
ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో డిప్లొమా | 6 నెలలు | -ఫైర్ సేఫ్టి ఎగ్జక్యూటివ్-అగ్నిమాపక భద్రతా అధికారి |
ఇంజనీరింగ్ డిప్లొమా | 3 సంవత్సరాలు | నేరుగా బి.టెక్ లాటరల్ ఎంట్రీకి లేదా నిర్దిష్ట స్పెషలైజేషన్ తో ఉద్యోగాలు |
సిరామిక్ టెక్నాలజీలో డిప్లొమా | 3 సంవత్సరాలు | నేరుగా బీటెక్ సిరామిక్ ఇంజనీరింగ్ లో లాటరల్ ఎంట్రీ లేదా సిరామిక్ ఇంజనీర్ గా ఉద్యోగ అవకాశం |
ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమా | 3 సంవత్సరాలు | -ప్లాస్టిక్ పార్ట్ మోల్డ్ డిజైన్ ఇంజనీర-ప్రాజెక్ట్ ఇంజనీర్-పారిశ్రామిక ఇంజనీర్-ఉత్పత్తి రూపకల్పన ఇంజనీర్ |
డెంటల్ మెకానిక్స్ లో డిప్లొమా | 2 సంవత్సరాలు | -దంత వైద్యుడు-అసిస్టెంట్ డెంటల్ సర్జన్-దంత సాంకేతిక నిపుణుడు |
డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ | 3 సంవత్సరాలు | -వాణిజ్య ఖాతా మేనేజర్-కమర్షియల్ ఎగ్జిక్యూటివ్-బిజినెస్ జూనియర్ హెడ్-బ్రాంచ్ కమర్షియల్ అసిస్టెంట్ మేనేజర్ |
హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీలో డిప్లొమా | 2 సంవత్సరాలు | -క్యాటరింగ్ ఆఫీసర్-క్యాటరింగ్ సూపర్ వైజర్లు మరియు అసిస్టెంట్లు-క్యాబిన్ సిబ్బంది-హాస్పిటాలిటీ ఎగ్జిక్యూటివ్ |
వ్యవసాయంలో డిప్లొమా | 2 సంవత్సరాలు | బీటెక్ అగ్రికల్చర్ లో నేరుగా లాటరల్ ఎంట్రీ లేదా వ్యవసాయ ఆధారిత సంస్థలో పనిచేయడానికి అవకాశం |
సైబర్ సెక్యూరిటీ లేదా ఎథికల్ హ్యాకింగ్ లో డిప్లొమా | 1 సంవత్సరం | సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ లేదా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు |
డిప్లొమా ఇన్ కాస్మోటాలజీ | 1 సంవత్సరం | -బ్యూటీ పార్లర్ తెరవవచ్చు-కాస్మోటిక్ బ్రాండ్స్ లో పని చేేసే అవకాశం |
ఆర్ట్ టీచర్ డిప్లొమా | 2 సంవత్సరాలు | -ఆర్ట్ టీచర్-చిత్రకారుడు-ఆర్ట్ గ్యాలరీ కోసం పనిచేసే అవకాశం |
స్టెనోగ్రఫీలో డిప్లొమా | 1 సంవత్సరం | ప్రభుత్వ ఉద్యోగాల్లో స్టెనోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం |
పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ కోర్సులు:
పాలిటెక్నిక్ కోర్సులు | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, గార్మెంట్ టెక్నాలజీ, వ్యవసాయంలో డిప్లొమా, ఆటో మొబైల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఏరో నాటికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రా నిక్స్ ఇన్ స్ట్రుమెంటేషన్ మరియు కంట్రోల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. |
సైన్స్ డిప్లొమా కోర్సులు | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా, ఆహార్ ఉత్పత్తిలో క్రాాఫ్ట్స్ మన్ షిప్ కోర్సు, డీజిల్ మెకానిక్స్ సర్టిఫికెట్, డెంటల్ మెకానిక్స్ డిప్లొమా, డెంటల్ హైజీనిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీఐ సర్వేయర్, కంప్యూటర్ హార్డ్ వేర్ మరియు నెట్ వర్క్ నిర్వహణ, ఎలక్ట్రానిక్ మెకానిక్, రేడియాలజీ టెక్నీషియన్, డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనర్ మెకానిక్, ఆలో ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ మెకానిక్. |
ఆర్ట్స్ డిప్లొమా కోర్సులు | వాణిజ్య కళ, గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ, మల్టీ మీడియా మరియు యానిమేషన్, హోటల్ మేనేజ్మెంట్, ప్యాషన్ డిజైనింగ్, 3డి యానిమేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెటింగ్, జర్నలిజంలో డిప్లొమా, ఫైర్ సేఫ్టీ |
వాణిజ్యంలో డిప్లొమా కోర్సులు | టాలీలో సర్టిఫికెట్ కోర్సు, బ్యాంకింగ్ డిప్లొమా, రిస్క్ అండ్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఈ-అకౌంటింగ్ టాక్సేషన్ |
అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు | సెరికల్చర్ లో సర్టిఫికెట్, పౌల్ట్రీ ఫార్మింగ్, అగ్రికల్చర్ సైన్స్,హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, హైబ్రిడ్ సీడ్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్ |
ఐటీ డిప్లొమా కోర్సులు | కంప్యూటర్ అప్లికేషన్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, హార్డ్ వేర్ మెయిన్ టేనెన్స్, సెర్చ్ ఇంజైన్ మార్కెటింగ్, కంప్యూటర్ టెక్నీషియన్, సెర్చ్ ఇంజైన్ ఆప్టమైజేషన్, వెబ్ డిజైన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ |
ట్రావెల్ మరియు టూరిజంలో డిప్లొమా | హోటల్ స్టోర్స్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఫ్రంట్ ఆఫీస్ మరియు రిసెప్షన్ మేనేజ్మెంట్, టూరిజం మరియు ట్రావెల్ మేనేజ్మెంట్, ఎయిర్ లైన్ మరియు టూరిజం మేనేజ్మెంట్, టూరిజం మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మరియు టూరిజం మేనేజ్మెంట్ |
పది తర్వాత పారామెడికల్ కోర్సులు:
- హాస్పిటాలిటీ అసిస్టెంట్ లో డిప్లొమా
- రూరల్ హెల్త్ కేర్
- పాథోలజీ ల్యాబ్ టెక్నీషియన్
- ఫిజియోథెరపీ
- పారామెడిక్ నర్సింగ్
- ఎక్స్ రే టెక్నాలజీ
- ఈసీజీ టెక్నాలజీ
- రేడియాలజీ
- డెంటల్ మెకానిక్స్
- డి.ఫార్మసీ
- ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
- మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ
- ఆప్థాల్మిక్ టెక్నాలజీ
- రేడియోగ్రఫీ మరియు మెడికల్ ఈమేజింగ్
- అనస్థిషియా టెక్నాలజీ
- డయాలసిస్ టెక్నాలజీ
- నర్సింగ్ కేర్ అసిస్టెంట్
- శానిటరీ ఇన్ స్పెక్షన్
- మెడికల్ రికార్డ్ టెక్నాలజీ
10వ తరగతి తర్వాత ITI కోర్సులు:
టూల్ అండ్ డై మేకర్, డ్రాఫ్ట్స్ మన్(మెకానికల్), డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మన్ (సివిల్), పంప్ ఆపరేటర్, ఫిల్టర్ ఇంజనీరింగ్, మోటార్ డ్రైవింగ్ కమ్ మెకానిక్, టర్నర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెషినిస్ట్, హెయిర్ అండ్ స్కిన్ కేర్, రిఫ్రిజిరేషన్, మెకానిక్ ఇన్ స్ట్రుమెంట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ రేడియో మరియు టీవీ, మెకానిక్ ఎలక్ట్రానిక్స్, సర్వేయర్ ఇంజనీరింగ్, ఫౌండ్రీ మ్యాన్, ఫీట్ మెటల్ వర్కర్ |
10వ తరగతి తర్వాత ఒకేషనల్ కోర్సులు:
- అకౌంటెన్సీ మరియు పన్నులు, ఆటో షాప్ రిపైర్ అండ్ ప్రాక్టీస్, బిజినెస్ ఆపరేషన్స్ మరియు అడ్మినిస్ట్రేషన్, కాపిటల్ మార్కెట్ ఆపరేషన్, సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఫుడ్ న్యూట్రిషన్ మరియు డైటెటిస్, ఫుడ్ ప్రొడక్షన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, టెక్స్ టైల్ డిజైన్, వెబ్ అప్లికేషన్
10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కోర్సులు:
పదో తరగతి తర్వాత రెండేళ్ల వ్యవధితో ఇంటర్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి.
- ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
- బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
- ఎంఈసీ(మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్)
- సీఈసీ(కామర్స్, ఎకనామిక్స్, కామర్స్)
10వ తరగతి తర్వాత ఉద్యోగ అవకాశాలు:
10వ తరగతి పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి.
రైల్వే శాఖ : 10వ తరగతి పూర్తి చేసుకున్న వారికి రైల్వే డిపార్ట్మెంట్ లో గ్రూప్-డి పోస్టులు, టికెట్ కలెక్టర్, రిజర్వేషన క్లర్క్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాల్లో చేరవచ్చు.
అటవీ శాఖ: 10వ తరగతి పూర్తి చేసుకున్న వారికి అటవీ శాఖలో ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ అఫీసర్, థానేదార్, బంగ్లా వాచర్ వంటి పోస్టుల్లో జాబ్స్ కొట్టవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ : 10వ తరగతి పూర్తి చేసుకున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, కేంద్ర భద్రతా దళాల్లో కానిస్టేబుళ్లు, రైఫిల్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రక్షణ శాఖ: 10వ తరగతి అర్హతతో రక్షణ శాఖలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆర్మీలో చేరిక, గ్రూప్-5, మల్టీ టాస్కింగ్, ఫైర్ మెన్, స్టీబార్డ్స్, వంట మనిషి ఉద్యోగాలు పొందవచ్చు.