AAI Junior Executive Recruitment 2025 ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 83 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 83
● జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీసెస్) – 13
● జూనియర్ ఎగ్జిక్యూటివ్ (హ్యూమన్ రీసోర్స్) – 66
● జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( అఫీషియల్ లాంగ్వేజ్) – 04
DFCCIL Recruitment 2025 | 10th, డిప్లొమా అర్హతతో 642 MTS, ఎగ్జిక్యటివ్ జాబ్స్ | కొద్ది రోజులే గడువు
అర్హతలు :
AAI Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి.
● జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీసెస్) పోస్టులకు ఫైర్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / ఆటో మొబైల్ ఇంజనీరింగ్ / ఇంజనీరింగ్ లేదా టెక్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
● జూనియర్ ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రీసోర్స్) పోస్టులకు HRM/HRD/PM&IR/Labour
Welfare స్పెషలైజేష్ తో గ్రాడ్యుయేషన్ మరియు MBA చేసి ఉండాలి.
● జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( అఫీషియల్ లాంగ్వేజ్) పోస్టులకు హిందీ లేదా ఇంగ్లీష్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ స్థాయిలో హిందీ మరియు ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఏదైనా ఇతర సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
Age Limit :
AAI Junior Executive Recruitment 2025 పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
AAI Junior Executive Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1000/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.
జీతం :
AAI Junior Executive Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుంచి రూ.1,40,000/- వరకు జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
AAI Junior Executive Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం :
AAI Junior Executive Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
Please I want this job