IDBI JAM Recruitment 2026 : IDBI బ్యాంక్ లో భారీ జాబ్స్ –  1100 ఉద్యోగాలు – డిగ్రీ ఉన్నవారికి మంచి అవకాశం

IDBI JAM Recruitment 2026 : ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్న యువతకు మంచి వార్త వచ్చింది. IDBI Bank Junior Assistant Manager (JAM) Grade-O 2026-27 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1100 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి మంచి జీతం, కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 8 నుండి మార్చి 19, 2026 వరకు స్వీకరిస్తారు.

IDBI బ్యాంక్ ఉద్యోగాల ఖాళీలు

IDBI బ్యాంక్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1100 Junior Assistant Manager (Grade-O) పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలు దేశంలోని వివిధ జోన్లలో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి జోన్లలో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ జోన్‌లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు ఒక్క జోన్‌కే దరఖాస్తు చేయాలి. పోస్టింగ్ ఆ జోన్‌లోని రాష్ట్రాల్లో ఉంటుంది.

  • పోస్టు పేరు : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్
  • పోస్టుల సంఖ్య : 1,100

విద్యార్హతలు

IDBI JAM Recruitment 2026 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC, EWS అభ్యర్థులు కనీసం 60% మార్కులు ఉండాలి. SC, ST, PwBD అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి. డిప్లొమా మాత్రమే చేసినవారు అర్హులు కాదు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం కూడా అవసరం.

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

వయోపరిమితి

IDBI JAM Recruitment 2026 ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థులు 2 మార్చి 2001 నుంచి 1 మార్చి 2006 మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు

IDBI JAM Recruitment 2026 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

  • SC / ST / PwBD అభ్యర్థులు: ₹250
  • ఇతర అభ్యర్థులు: ₹1050

ఫీజు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించవచ్చు. ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత తిరిగి ఇవ్వరు.

ఎంపిక ప్రక్రియ

IDBI JAM Recruitment 2026 ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. మొదట ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మరియు బ్యాంకింగ్ అవేర్‌నెస్ వంటి విషయాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో సాధించిన మార్కులు మరియు ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.

  • ఆన్ లైన్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్

జీతం వివరాలు

IDBI JAM Recruitment 2026 IDBI బ్యాంక్‌లో Junior Assistant Manager గా ఎంపికైన వారికి మంచి జీతం ఉంటుంది. ప్రారంభంలో ₹6.14 లక్షల నుండి ₹6.50 లక్షల వరకు వార్షిక ప్యాకేజ్ (CTC) ఉంటుంది. పనితీరు ఆధారంగా ప్రతి సంవత్సరం జీతం పెరుగుతుంది. అలాగే మూడు సంవత్సరాల తర్వాత ప్రమోషన్ అవకాశం కూడా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 8 మార్చి 2026
  • దరఖాస్తు చివరి తేదీ: 19 మార్చి 2026
  • ఆన్‌లైన్ పరీక్ష (టెంటేటివ్): 12 ఏప్రిల్ 2026

దరఖాస్తు విధానం

IDBI JAM Recruitment 2026 అభ్యర్థులు IDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. తర్వాత ఫోటో, సిగ్నేచర్, thumb impression మరియు hand written declaration అప్లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకుని భద్రంగా ఉంచుకోవాలి.

NotificationClick here
Apply Online Click here

Also Read : HPCL Recruitment 2026: HPCLలో భారీ నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!