GAIL Executive Trainee Recruitment 2026 | గ్యాస్ సంస్థలో గోల్డెన్ ఛాన్స్ – ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

GAIL Executive Trainee Recruitment 2026 : మహారత్న PSUలో కెరీర్ నిర్మించాలనుకునే ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం. దేశంలోని ప్రముఖ నేచురల్ గ్యాస్ సంస్థ GAIL (India) Limited Executive Trainee పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా GATE-2026 స్కోర్ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి అధిక జీతం, PSU ప్రయోజనాలు, స్థిరమైన కెరీర్ లభిస్తాయి .

ఖాళీల వివరాలు (Vacancy Details)

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 Executive Trainee పోస్టులు భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు:

  • Chemical – 17
  • Instrumentation – 21
  • Electrical – 16
  • Mechanical – 16

అర్హతలు (Educational Qualification)

GAIL Executive Trainee Recruitment 2026 అభ్యర్థులు సంబంధిత విభాగంలో B.E / B.Tech / B.Sc Engineering డిగ్రీ కనీసం 65% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. SC/ST/PwBD అభ్యర్థులకు మార్కులలో సడలింపు ఉంటుంది. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లై చేయవచ్చు. సంబంధిత GATE-2026 పేపర్ తప్పనిసరి .

వయోపరిమితి (Age Limit)

GAIL Executive Trainee Recruitment 2026 18 మార్చి 2026 నాటికి అభ్యర్థి గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు ఉండాలి.

  • SC/ST – 5 సంవత్సరాలు సడలింపు
  • OBC (NCL) – 3 సంవత్సరాలు సడలింపు
  • PwBD – గరిష్టంగా 10–15 సంవత్సరాలు సడలింపు

అప్లికేషన్ ఫీజు (Application Fee)

GAIL Executive Trainee Recruitment 2026 ఈ నోటిఫికేషన్‌లో ప్రత్యేకంగా అప్లికేషన్ ఫీజు లేదు. GAIL Executive Trainee పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే GATE పరీక్ష ఫీజు మాత్రం అభ్యర్థి వేరుగా చెల్లించాలి .

ఎంపిక ప్రక్రియ (Selection Process)

GAIL Executive Trainee Recruitment 2026 ఎంపిక పూర్తిగా GATE-2026 స్కోర్ ఆధారంగా జరుగుతుంది. GATE మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, తరువాత Group Discussion మరియు Interview నిర్వహిస్తారు. తుది ఎంపిక GATE స్కోర్ + ఇంటర్వ్యూ పనితీరు ఆధారంగా ఉంటుంది. మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి .

జీతం వివరాలు (Salary Details)

GAIL Executive Trainee Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులు E-2 గ్రేడ్లో నియమితులవుతారు. ట్రైనింగ్ సమయంలో జీతం ₹60,000 – ₹1,80,000 పే స్కేల్లో ఉంటుంది. DA, HRA, మెడికల్, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రయోజనాలు వంటి అనేక PSU సదుపాయాలు లభిస్తాయి. ప్రమోషన్ అవకాశాలు కూడా మంచి స్థాయిలో ఉంటాయి .

దరఖాస్తు విధానం (How to Apply)

GAIL Executive Trainee Recruitment 2026 అభ్యర్థులు https://gailonline.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా GATE-2026కు అప్లై చేసి అడ్మిట్ కార్డ్ పొందాలి. తరువాత GAIL వెబ్‌సైట్‌లో GATE రిజిస్ట్రేషన్ నంబర్‌తో అప్లికేషన్ నింపాలి.

  • దరఖాస్తు ప్రారంభం: 20 ఫిబ్రవరి 2026
  • చివరి తేదీ: 18 మార్చి 2026 .
NotificationClick here
Apply OnlineClick here

Also Read : RBI Assistant Recruitment 2026 | 650 బ్యాంక్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News
error: Content is protected !!