BSNL SET Recruitment 2026 : టెలికాం రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే ఇంజినీరింగ్, ఫైనాన్స్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Bharat Sanchar Nigam Limited (BSNL) 2026 సంవత్సరానికి Senior Executive Trainee (SET) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్‌లలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎంపికైన వారికి ట్రైనింగ్‌తో పాటు ఆకర్షణీయమైన జీతం లభిస్తుంది.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 SET పోస్టులు భర్తీ చేయనున్నారు.
- SET (Telecom): 95 పోస్టులు
- SET (Finance): 25 పోస్టులు
అర్హతలు (Educational Qualification)
BSNL SET Recruitment 2026 Telecom స్ట్రీమ్‌కు సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ (Electronics, Telecom, Computer Science, IT, Electrical, Instrumentation మొదలైనవి) కనీస మార్కులతో ఉండాలి.
Finance స్ట్రీమ్‌కు CA లేదా CMA అర్హత అవసరం. అన్ని అర్హతలు దరఖాస్తు చివరి తేదీ నాటికి పూర్తై ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
BSNL SET Recruitment 2026 దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి (Unreserved / EWS).
- OBC (NCL): 33 సంవత్సరాలు
- SC / ST: 35 సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు కేటగిరీ ప్రకారం అదనపు వయో సడలింపు ఉంటుంది.
వయోపరిమితి కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం అమలు చేస్తారు.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
BSNL SET Recruitment 2026 అభ్యర్థులు ₹500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజు ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే (డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్) చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
BSNL SET Recruitment 2026 ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో అప్తిట్యూడ్ టెస్ట్ మరియు సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.
జీతం వివరాలు (Salary Details)
BSNL SET Recruitment 2026 ఎంపికైన SETలకు E-3 పే స్కేల్ వర్తిస్తుంది. ట్రైనింగ్ సమయంలో ₹24,900 – ₹50,500 జీతం ఉంటుంది (pre-revised). ట్రైనింగ్ పూర్తయ్యాక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా నియామకం జరుగుతుంది. DA, HRA, ఇతర అలవెన్సులు BSNL నిబంధనల ప్రకారం అందుతాయి.
దరఖాస్తు విధానం (How to Apply)
BSNL SET Recruitment 2026 అభ్యర్థులు www.bsnl.co.in లేదా www.externalexam.bsnl.co.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ సేవ్ చేసుకోవాలి.
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 05-02-2026 ఉదయం 10 గంటలకు
- దరఖాస్తు చివరి తేదీ: 03-03-2026 సాయంత్రం 6 గంటల వరకు
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : UPSC CSE Notification 2026 | IAS, IPS ఆఫీసర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్