ECIL Apprentice Recruitment 2026 |  ECIL హైదరాబాద్‌లో 248 అప్రెంటిస్ పోస్టులు

ECIL Apprentice Recruitment 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థ Electronics Corporation of India Limited (ECIL) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Graduate Engineer Apprentice (GEA) మరియు Diploma Apprentice (TA) పోస్టులను భర్తీ చేస్తున్నారు.  హైదరాబాద్‌లోని ECIL యూనిట్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం మొత్తం 248 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు నెలకు ₹9,000 వరకు స్టైపెండ్ లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసకోవాలి. 

ఖాళీల వివరాలు (Vacancy Details)

ECE, CSE/IT, Mechanical, EEE, EIE, Civil, Chemical బ్రాంచ్ లలో పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం 248 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • Graduate Engineer Apprentice (GEA)200 పోస్టులు
  • Diploma Apprentice (TA)48 పోస్టులు

Also Read : Indian Army SSC Tech Recruitment 2026 | ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు – 350 పోస్టులు | ₹56,100 జీతం

అర్హతలు (Educational Qualification)

ECIL Apprentice Recruitment 2026 అభ్యర్థులకు అప్రెంటిస్ విభాగాన్ని బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి.

  • GEA పోస్టులకు:
    • B.E / B.Tech (సంబంధిత బ్రాంచ్)
    • AICTE గుర్తింపు పొందిన కాలేజీ నుంచి
    • 01 ఏప్రిల్ 2023 తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
  • TA పోస్టులకు:
    • సంబంధిత బ్రాంచ్‌లో 3 సంవత్సరాల డిప్లొమా
    • 01 ఏప్రిల్ 2023 తర్వాత పూర్తి చేసి ఉండాలి

వయోపరిమితి (Age Limit)

ECIL Apprentice Recruitment 2026 అభ్యర్థులకు 31 డిసెంబర్, 2025 నాటికి 25 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC (NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు (Application Fee)

ECIL Apprentice Recruitment 2026 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ (Selection Process)

ECIL Apprentice Recruitment 2026 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 

  • ముందుగా ఆన్‌లైన్ అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్
  • తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా
    • GEA: B.E / B.Tech మార్కులు
    • TA: డిప్లొమా మార్కులు

స్టైపెండ్ వివరాలు (Stipend)

ECIL Apprentice Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతంది. 

  • Graduate Engineer Apprentice: ₹9,000 / నెల
  • Diploma Apprentice: ₹8,000 / నెల

అప్రెంటిస్ ట్రైనింగ్ వివరాలు

  • ట్రైనింగ్ ప్రారంభం: 09 ఫిబ్రవరి 2026
  • ట్రైనింగ్ స్థలం: ECIL, హైదరాబాద్
  • ఇది కేవలం అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే
  • ట్రైనింగ్ తర్వాత ఉద్యోగ హామీ లేదు

దరఖాస్తు విధానం (How to Apply)

ECIL Apprentice Recruitment 2026 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు రెండు స్టెప్స్‌లో చేయాలి.

Step–1:

  • NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయాలి
  • వెబ్‌సైట్: www.nats.education.gov.in

Step–2:

  • ECIL వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి
  • Path: www.ecil.co.in → Careers → Current Job Openings
  • అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి

ముఖ్యమైన తేదీలు (Important Dates)

  • నోటిఫికేషన్ విడుదల: 06-01-2026
  • అప్లికేషన్ చివరి తేదీ: 20-01-2026 (16:30 వరకు)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్: 28–30 జనవరి 2026
  • ట్రైనింగ్ ప్రారంభం: 09-02-2026
NotificationClick here
Apply OnlineClick here

Also Read : Cochin Shipyard Recruitment 2026: Cochin Shipyard లో పర్మనెంట్ జాబ్స్ – 210 పోస్టులు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!