NSUT Faculty Recruitment 2025 : దేశంలోని ప్రముఖ సాంకేతిక విశ్వవిద్యాలయాలలో ఒకటైన నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT), ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 176 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు (Vacancy Details):
- అసిస్టెంట్ ప్రొఫెసర్ – 126
- అసోసియేట ప్రొఫెసర్ – 50
Also Read : Nothing Phone 3a Lite India Launch Soon | Price ₹20,000 Expected
అర్హతలు (Eligibility Criteria) :
అసిస్టెంట ప్రొఫెసర్ :
- B.E./B.Tech./B.S. మరియు M.E./M.Tech./M.S. లేదా ఇంటిగ్రేటెడ్ M.Tech. సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్‌తో ఉండాలి.
- ఎటువంటి అనుభవం అవసరం లేదు.
అసోసియేట్ ప్రొఫెసర్ :
- బ్యాచిలర్ లేదా మాస్టర్ లెవెల్లో ఫస్ట్ క్లాస్ ఉండాలి.
- కనీసం 8 సంవత్సరాల బోధన/పరిశోధన/ఇండస్ట్రి అనుభవం ఉండాలి, అందులో కనీసం 2 సంవత్సరాలు Post-Ph.D. అనుభవం కావాలి.
- కనీసం 6 రీసెర్చ్ పబ్లికేషన్లు ఉండాలి (వాటిలో 3 SCI/SCIE జర్నల్స్‌లో తప్పనిసరి).
వయో పరిమితి (Age Limit) :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 35 సంవత్సరాలు
- అసోసియేట్ ప్రొఫెసర్ : 50 సంవత్సరాలు
- ప్రభుత్వ నియమాల ప్రకారం EWS/SC/ST/OBC/PwBD అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
వర్గం | రిజిస్ట్రేషన్ + ప్రాసెసింగ్ ఫీజు |
General/OBC/EWS | ₹2,000/- |
SC/ST/PwBD | ₹1,000/- |
ఎంపిక ప్రక్రియ (Selection Process) :
- అర్హతల ఆధారంగా షార్ట్ లిస్టింగ్
- రాత పరీక్ష / టీచింగ్ ఆప్టిట్యూడ్ అసెస్మెంట్
- ఇంటర్వ్యూ
- తుది ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.
Also Read : RITES Recruitment 2025 | RITES సంస్థలో 600+ ఇంజినీరింగ్ పోస్టులు!
జీతం వివరాలు (Pay Scale) :
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (Level-10) : ₹57,700 – ₹1,82,400/-
- అసోసియేట్ ప్రొఫెసర్((Level-13A1) : ₹1,31,400 – ₹2,17,100/-
దరఖాస్తు విధానం (How to Apply) :
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ www.nsut.ac.in ను సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత, దాని ప్రింట్ అవుట్ తీసుకుని అవసరమైన డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లు జతచేసి క్రింది చిరునామాకు పంపాలి.
- The Registrar, Netaji Subhas University of Technology, Azad Hind Fauj Marg, Sector-3, Dwarka, New Delhi – 110078
- కవర్ పై స్పష్టంగా “Application for the post of ______ in ______ Department in NSUT” అని రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 06 అక్టోబర్ 2025
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 11 నవంబర్ 2025
- హార్డ్ కాపీ సమర్పణ చివరి తేది: 26 నవంబర్ 2025 సాయంత్రం 5 గంటలలోపు
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : RRC NER Sports Quota Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ – ఇలా అప్లయ్ చేయండి