IWAI Recruitment 2025 : ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(IWAI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ మరియు సీనియర్ అంకౌట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IWAI Recruitment 2025 Overview
నియామక సంస్థ | భారత అంతర్రాష్ట్ర జలమార్గ ప్రాధికార సంస్థ (Inland Waterways Authority of India – IWAI) |
పోస్టు పేరు | లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ మరియు సీనియర్ అంకౌట్ ఆఫీసర్ |
ఖాళీల సంఖ్య | 14 |
దరఖాస్తు ప్రక్రియ | 7 అక్టోబర్ – 5 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్సైట్ | www.iwai.nic.in |
Also Read : BRO Recruitment 2025 | రోడ్స్ ఆర్గనైజేషన్ లో 542 జాబ్స్.. వివరాలు ఇవిగో..
ఖాళీల వివరాలు(Vacancy Details) :
భారత అంతర్రాష్ట్ర జలమార్గ ప్రాధికార సంస్థ (Inland Waterways Authority of India – IWAI) 2025 సంవత్సరానికి సంబంధించిన కొత్త నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా Lower Division Clerk (LDC), Junior Hydrographic Surveyor (JHS), Senior Accounts Officer వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు నేరుగా (Direct Recruitment) పద్ధతిలో జరుగుతాయి. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
లోయర్ డివిజనల్ క్లర్క్ | 4 |
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ | 9 |
సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ | 1 |
మొత్తం | 14 |
అర్హతలు(Eligibility):
IWAI Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతల్లో మార్పు ఉంటుంది. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- లోయర్ డివిజనల్ క్లర్క్(LDC) : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. కంప్యూటర్ టైపింగ్ వేగం ఇంగ్లీష్‌లో 35 w.p.m లేదా హిందీలో 30 w.p.m. ఉండాలి.
- జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్(JHS): సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా మరియు కనీసం 3 ఏళ్ల హైడ్రోగ్రాఫిక్ లేదా ల్యాండ్ సర్వే అనుభవం లేదా భారత నౌకాదళంలో SR I/II ర్యాంకుతో 7 ఏళ్ల హైడ్రోగ్రఫీ / నావిగేషన్ అనుభవం.
- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ మరియు Chartered Accountants / Cost Accountants ఫైనల్ ఎగ్జామ్ పాస్ కావాలి లేదా భారత ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగం యొక్క SAS Commercial పరీక్ష ఉత్తీర్ణత. కనీసం 3 సంవత్సరాల అనుభవం – కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో లేదా గుర్తింపు పొందిన సంస్థలో. బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి అదనపు ప్రాధాన్యం.
వయోపరిమితి (Age Limit):
IWAI Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుది.
- లోయర్ డివిజన్ క్లర్క్ : 18 నుంచి 27 సంవత్సరాలు
- జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ : 30 సంవత్సరాల లోపు
- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : 35 సంవత్సరాల లోపు
అప్లికేషన్ ఫీజు :
IWAI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- UR / OBC / EWS అభ్యర్థులు: ₹500/-
- SC / ST / PwBD / మహిళలు / Ex-Servicemen: ఫీజు లేదు.
ఎంపిక విధానం (Selection Process):
IWAI Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి కింది దశల్లో జరుగుతుంది.
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC):
- CBT (Computer Based Test) + టైపింగ్ స్కిల్ టెస్ట్
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (JHS):
- CBT మాత్రమే
సీనియర్ అకౌంట్ ఆఫీసర్:
- CBT + ఇంటర్వ్యూ
అర్హత మార్కులు: UR – 45%, OBC/EWS – 40%, SC/ST/PwD – 35%
పరీక్షా కేంద్రాలు: Delhi/NCR, Mumbai, Kolkata, Chennai, Guwahati, Patna, Kochi
Also Read : PRL Recruitment 2025 | అంతరిక్ష పరిశోధన సంస్థలో జాబ్స్
జీతం వివరాలు :
IWAI Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- లోయర్ డివిజన్ క్లర్క్(లెవల్-2) : రూ.19,900 – రూ.63,200/-
- జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ : రూ.35,400 – రూ.1,12,400/-
- సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : రూ.56,100 – రూ.1,77,500/-
దరఖాస్తు విధానం (How to Apply):
IWAI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.iwai.nic.in లోకి వెళ్లాలి.
- “Recruitment” → “Apply Online” సెక్షన్లోకి వెళ్లాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 7 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 5 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : Indian Army TGC-143 Recruitment 2025 | ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్
2 thoughts on “IWAI Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సర్వేయర్ జాబ్స్”