VITM Trainee Craft Recruitment 2025 : విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలజికల్ మ్యూజియం (VITM), బెంగళూరులో ట్రైనీ క్రాఫ్ట్ (Trainee Craft) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ ట్రైనీషిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. పనితీరు బాగుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

VITM Trainee Craft Recruitment 2025 Overview
నియామక సంస్థ | విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం(VITM) |
పోస్టు పేరు | ట్రైనీ క్రాఫ్ట్(ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్) |
పోస్టుల సంఖ్య | 6 |
దరఖాస్తు విధానం | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
వాక్ ఇన్ తేదీ | 27 అక్టోబర్, 2025 |
Also Read : VISMUSEUM Recruitment 2025 | మ్యూజియంలో అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల వివరాలు (Vacancy Details):
బెంగళూరులో ఉన్న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం నుంచి ట్రైనీ క్రాఫ్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ట్రైనీ క్రాఫ్ట్ (ఫిట్టర్) | 02 |
ట్రైనీ క్రాఫ్ట్ (ఎలక్ట్రానిక్స్) | 02 |
ట్రైనీ క్రాఫ్ట్ (వెల్డర్) | 01 |
ట్రైనీ క్రాప్ట్ (ఎలక్ట్రికల్) | 01 |
మొత్తం | 06 |
అర్హతలు (Eligibility):
VITM Trainee Craft Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
- ఐటీఐ సర్టిఫికెట్ 2020 కంటే ముందుగా జారీ చేయబడకూడదు.
- ఎక్కువ అర్హత (హయ్యర్ క్వాలిఫికేషన్) కలిగిన వారు మరియు ఇప్పటికే NCSM లో ట్రైనీషిప్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయకూడదు.
ఉద్యోగ బాధ్యతలు:
- ఎగ్జిబిట్స్ / ఎక్విప్‌మెంట్ / ఇన్‌స్టాలేషన్‌ల ఆపరేషన్, రిపేర్, ఫ్యాబ్రికేషన్, హ్యాండ్లింగ్, ప్యాకింగ్, ఇన్‌స్టాలేషన్ మరియు మెయింటెనెన్స్ పనులు.
- సదరు మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్‌తో దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ప్రయాణాలు.
- క్యూక్యూరేటర్ / ఎడ్యుకేషన్ ఆఫీసర్‌లకు సహకారం అందించడం.
వయోపరిమితి(Age Limit)
VITM Trainee Craft Recruitment 2025 నోటిఫికేషన్ లో వయోపరిమితి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.
అప్లికేషన్ ఫీజు(Application fees) :
VITM Trainee Craft Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ(Selection Process):
VITM Trainee Craft Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్)
- ట్రేడ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)
- రాత పరీక్షలో కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ట్రేడ్ టెస్ట్‌కు అర్హులు అవుతారు.
Also Read : SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు(Salary Details) :
VITM Trainee Craft Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ట్రైనీషిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. పనితీరు బాగుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉంది. ట్రైనీషిప్ సమయంలో ప్రతి నెల రూ.22,000/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- స్టైపెండ్ (ప్రతి నెల): ₹22,000/-
దరఖాస్తు విధానం(How to Apply) :
VITM Trainee Craft Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైతే చాలు.
- అభ్యర్థులు ముందుగా www.vismuseum.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు మరియు మార్క్స్ లిస్టులు, జనన ధ్రువీకరణ పత్రం, ఐడీ ఫ్రూఫ్ జత చేయాలి.
వాక్ ఇన్ టెస్ట్ తేదీలు :
- ఫిట్టర్ : 27.10.2025
- ఎలక్ట్రానిక్స్, వెల్డర్ : 28.10.2025
- ఎలక్ట్రికల్ : 28.10.2025
- రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:30 గంటలకు
వాక్ ఇంటర్వ్యూ వేదిక :
- Visvesvaraya Industrial & Technological Museum (VITM),
- కస్తూర్బా రోడ్, బెంగళూరు – 560001
Notification | Click here |
Application form | Click here |
Official Website | Click here |
Also Read : BISAG-N Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో 100 ఖాళీలు.. ఆన్ లైన్ అప్లయ్ చేసుకోండి.
2 thoughts on “VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్”