APPSC Assistant Engineer Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

APPSC Assistant Engineer Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
డిపార్ట్మెంట్ | ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ |
పోస్టు పేరు | అసిస్టెంట్ ఇంజనీర్ |
పోస్టుల సంఖ్య | 11 |
దరఖస్తు ప్రక్రియ | 25 సెప్టెంబర్ – 15 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్ సైట్ | https://psc.ap.gov.in |
Also Read : APPSC Welfare Organiser Recruitment 2025 | వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు నోటిఫికేషన్
Vacancy Details:
ఏపీ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రపద్రేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Post Code | Department | Zone-I | Zone-II | Zone-III | Zone-IV | Total |
01 | AE (Civil) – A.P. Rural Water Supply & Sanitation Engg. Sub-Service | 01 | — | 02 | 01 | 04 |
02 | AE (Civil) – A.P. Water Resources Sub-Service | 01 | 01 | 02 | 01 | 05 |
03 | AE (Civil/Mechanical) – A.P. Panchayati Raj & Rural Development Sub-Service | 02 | — | — | — | 02 |
Total | 04 | 01 | 04 | 02 | 11 |
Eligibility (అర్హతలు):
APPSC Assistant Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు ఉండాలి.
- Post Code 01: LCE (Diploma in Civil) – State Board of Technical Education & Training, A.P. లేదా సమానమైన అర్హత.
- Post Code 02: Diploma / B.E / B.Tech in Civil Engineering – గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా AICTE/UGC ఆమోదం ఉన్న సంస్థ నుంచి.
- Post Code 03: B.E (Civil) లేదా B.E (Mechanical) లేదా DCE/LME/LAE/LSE వంటి Diploma – SBTET A.P. లేదా సమానమైన అర్హత. (కానీ ఈ పోస్టుల ఖాళీలు Civil Engineering అభ్యర్థులకే కేటాయించబడ్డాయి)
- Computer Proficiency Test (CPT) లో ఉత్తీర్ణత తప్పనిసరి.
Age Limit (వయోపరిమితి):
APPSC Assistant Engineer Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, BC, Ex-Servicemen మొదలైన వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
Application Fee (అప్లికేషన్ ఫీజు):
APPSC Assistant Engineer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు : రూ.250/-
- ఎగ్జామినేషన్ ఫీజు : రూ.80/-
- SC, ST, BC, PBDs, Ex-Servicemen, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, నిరుద్యోగ యువత లకు ఎగ్జామ్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
Selection Process (ఎంపిక ప్రక్రియ):
APPSC Assistant Engineer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : AP Outsourcing Jobs 2025 Notification | ఏపీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
Salary Details (జీతం వివరాలు):
APPSC Assistant Engineer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ₹48,440 – ₹1,37,220 /- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply (దరఖాస్తు విధానం):
APPSC Assistant Engineer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC వెబ్‌సైట్ https://psc.ap.gov.in లోకి వెళ్లాలి.
- One Time Profile Registration (OTPR) పూర్తి చేయాలి.
- OTPR ID తో Login అయ్యి Online Application Submission పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ Save & Submit బటన్ పై క్లిక్ చేసిన తరువాత మాత్రమే Application పూర్తవుతుంది.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : ISRO VSSC Driver Notification 2025 | ఇస్రోలో డ్రైవర్, కుక్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “APPSC Assistant Engineer Recruitment 2025 | ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్”