APPSC Welfare Organiser Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు 09.10.2025 నుండి 29.10.2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు Ex-Service Personnel అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Welfare Organiser Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
డిపార్ట్మెంట్ | ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ |
పోస్టు పేరు | వెల్ఫేర్ ఆర్గనైజర్ |
పోస్టుల సంఖ్య | 10 |
దరఖస్తు ప్రక్రియ | 09 అక్టోబర్ – 29 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్ సైట్ | https://psc.ap.gov.in |
Also Read : APPSC Hostel Welfare Officer Recruitment 2025
Vacancy Details:
ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లో వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టుల భర్తీ కోసం ఆంధ్రపద్రేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లా వారీగా పోస్టులు :
- శ్రీకాకుళం – 01 (Local)
- విజయనగరం – 01 (Local)
- విశాఖపట్నం – 01 (Local)
- ఈస్ట్ గోదావరి @ కాకినాడ – 01 (Local)
- గుంటూరు – 02 (1 Local, 1 Non-Local)
- ప్రకాశం – 01 (Local)
- SPSR నెల్లూరు – 01 (Local)
- అనంతపురం – 01 (Local)
- కడప – 01 (Local)
మొత్తం: 10 పోస్టులు
Eligibility (అర్హతలు):
APPSC Welfare Organiser Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కింది అర్హతలు ఉండాలి.
- అభ్యర్థి Ex-Service Personnel అయి ఉండాలి.
- కనీసం Intermediate (10+2) లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత అవసరం.
- అభ్యర్థి తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి.
- Computer Proficiency Test లో ఉత్తీర్ణత సాధించాలి.
Age Limit (వయోపరిమితి):
APPSC Welfare Organiser Recruitment 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
Application Fee (అప్లికేషన్ ఫీజు):
APPSC Welfare Organiser Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫీజు : రూ.250/-
- ఎగ్జామినేషన్ ఫీజు : రూ.80/-
- ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఎగ్జామ్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
Selection Process (ఎంపిక ప్రక్రియ):
APPSC Welfare Organiser Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
Written Examination (OMR Based):
- Paper I – General Studies & Mental Ability (150 ప్రశ్నలు, 150 మార్కులు)
- Paper II – Secretarial Abilities (150 ప్రశ్నలు, 150 మార్కులు)
- Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత.
Computer Proficiency Test (CPT):
- MS Word, Excel, PowerPoint మొదలైన వాటిలో ప్రాక్టికల్ పరీక్ష
- Qualifying Marks: 40% (Ex-Servicemen కోసం)
Also Read : APPSC Junior Lecturer Notification 2025
Salary Details (జీతం వివరాలు):
APPSC Welfare Organiser Recruitment 2025 వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,220 నుంచి రూ.80,910/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply (దరఖాస్తు విధానం):
APPSC Welfare Organiser Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC వెబ్సైట్ https://psc.ap.gov.in లోకి వెళ్లాలి.
- One Time Profile Registration (OTPR) పూర్తి చేయాలి.
- OTPR ID తో Login అయ్యి Online Application Submission పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. అప్లికేషన్ Save & Submit బటన్ పై క్లిక్ చేసిన తరువాత మాత్రమే Application పూర్తవుతుంది.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 09 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 29 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APPSC AEE Recruitment 2025
2 thoughts on “APPSC Welfare Organiser Recruitment 2025 | వెల్ఫేర్ ఆర్గనైజర్ పోస్టులకు నోటిఫికేషన్”