Canara Bank Apprentice Recruitment 2025 : కెనరా బ్యాంక్ నుంచి మరో భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది. అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Canara Bank Apprentice Recruitment 2025 Overview
నియామక సంస్థ | కెనరా బ్యాంకు |
పోస్టు పేరు | గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ |
ఖాళీల సంఖ్య | 3,500 |
దరఖాస్తు ప్రక్రియ | 23 సెప్టెంబర్ – 12 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : IBPS RRB Notification 2025 | గ్రామీణ బ్యాంకుల్లో 12 వేల పోస్టులు.. అప్లయ్ చేశారా?
ఖాళీల వివరాలు :
కెనరా బ్యాంక్ వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,500 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- పోస్టు పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
- దేశవ్యాప్తంగా ఖాళీలు : 3,500
- ఆంధ్రప్రదేశ్ ఖాళీలు : 242
- తెలంగాణ ఖాళీలు : 132
అర్హతలు :
Canara Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ
- అభ్యర్థులు 01.01.2022 మరియు 01.09.2025 మధ్య గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
Canara Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Canara Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : ఫీజు లేదు
- ఇతర అభ్యర్థులకు : రూ.500/-
ఎంపిక ప్రక్రియ :
Canara Bank Apprentice Recruitment 2025 కెనరా బ్యాంకు అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మార్కుల నుంచి రాష్ట్రాల వారీగా తయారు చేసిన మెరిట్ ర్యాంకింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- మెరిట్ జాబితా పూర్తిగా గ్రాడ్యుయేషన్ సమయంలో అకడమిక్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు.
- బ్యాంకు ప్రమాణాల ప్రకారం మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్
- 10వ లేదా 12వ స్థాయిలో స్థానిక భాష చదివిన అభ్యర్థులకు స్థానిక భాష పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
Also Read : Bank of Baroda Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్ – జీతం రూ.1.2 లక్షల వరకు!
స్టైఫండ్ వివరాలు :
Canara Bank Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు కెనరా బ్యాంక్ శాఖలలో శిక్షణ ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.15,000/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Canara Bank Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు కెనరా బ్యాంక్ వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ – రిక్రూట్మెంట్ – గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల్లో క్లిక్ చేయాలి.
- అభ్యర్థులు ముందుగా అప్రెంటిస పోర్టల్ https://nats.education.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 సెప్టెంబర్, 2025
Notification | Click here |
NATS Portal | Click here |
Apply Online | Click here |
Also Read : Punjab & Sind Bank SO Recruitment 2025 | స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్