HVF Junior Manager Recruitment 2025: ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) యూనిట్ అయిన హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ(HVF) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

HVF Junior Manager Recruitment 2025 Overview
విభాగం | వివరాలు |
సంస్థ పేరు | Heavy Vehicles Factory (Unit of AVNL), Ministry of Defence |
పోస్టు పేరు | Junior Manager (Integrated Material Management) |
ఖాళీల సంఖ్య | 20 |
వయోపరిమితి | 30 సంవత్సరాలు |
అర్హత | First Class Engineering Degree / Degree + MBA |
జీతం | రూ.30,000/- (Consolidated) |
దరఖాస్తు విధానం | ఆఫ్లైన్ |
చివరి తేదీ | 11 అక్టోబర్ 2025 |
Also Read : IIT Tirupati JRF Recruitment 2025 | పరీక్ష లేేకుండా IIT తిరుపతిలో ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
రక్షణ రంగంలో కెరీర్ కొనసాగించాలని కలలు కనే అభ్యర్థులకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆర్మర్డ్ వెహికిల్స్ నిజం లిమిటెడ్ (AVNL)కి చెందిన హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ, అవడీ (చెన్నై) లో Junior Manager (Integrated Material Management) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇది ఒక Fixed Term Contract Job. మొత్తం 20 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- పోస్టు పేరు : జూనియర్ మేనేజర్ (ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్)
- పోస్టుల సంఖ్య : 20
అర్హతలు :
HVF Junior Manager Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఫస్ట్ క్లాస్ డిగ్రి + MBA ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
HVF Junior Manager Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
HVF Junior Manager Recruitment 2025 అభ్యర్థులు SBI కలెక్ట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.300/-
- ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్ మెన్/మహిళలు : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
HVF Junior Manager Recruitment 2025 అభ్యర్థులను అప్లికేషన్ స్క్రీనింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అప్లికేషన్ స్క్రీనింగ్
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : DRDO SSPL Recruitment 2025 | MTS & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
HVF Junior Manager Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- + IDA (All Inclusive) చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం :
HVF Junior Manager Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు పెట్టుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాలి – www.ddpdoo.gov.in / www.avnl.co.in.
- అప్లికేషన్‌ను జాగ్రత్తగా నింపలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జత చేయాలి.
- అప్లికేషన్‌ను సాధారణ పోస్టు ద్వారా ఈ చిరునామాకు పంపాలి:
- Chief General Manager, Heavy Vehicles Factory,
Avadi, Chennai – 600 054,
Post Bag No. 01 - కవర్ మీద “Application for the Post of Junior Manager (IMM)” అని స్పష్టంగా రాయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11 అక్టోబర్, 2025
Notification & Application | Click here |
Also Read : NHPC Trainee recruitment 2025 | NHPCలో ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “HVF Junior Manager Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ నోటిఫికేషన్”