Bank of Baroda Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ట్రేడ్ మరియు ఫారెక్స్ విభాగం, కార్పొరేట్ అకౌంట్స్ మరియు టాక్సేషన్ విభాగాల్లో మొత్తం 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 09వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Bank of Baroda Recruitment 2025 Overview
నియామక సంస్థ | బ్యాంక్ ఆఫ్ బరోడా |
పోస్టుల పేర్లు | చీఫ్ మేనేజర్, మేనేజర్ – ట్రేడ్ ఫైనాన్స్, మేనేజర్/సీనియర్ మేనేజర్ – ఫారెక్స్ రిలేషన్‌షిప్ |
ఖాళీల సంఖ్య | 58 |
దరఖాస్తు ప్రక్రియ | 19 సెప్టెంబర్ – 09 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
Also read : ARCI Project Scientist Recruitment 2025 | ARCIలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) వివిధ విభాగాలలో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా, ట్రేడ్ & ఫారెక్స్ విభాగం, కార్పొరేట్ అకౌంట్స్ & టాక్సేషన్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
చీఫ్ మేనేజర్ – ఇన్వెస్టర్ రిలేషన్‌స్ | 02 |
మేనేజర్ – ట్రేడ్ ఫైనాన్స్ ఆపరేషన్స్ | 14 |
మేనేజర్ – ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ | 37 |
సీనియర్ మేనేజర్ – ఫారెక్స్ అక్విజిషన్ & రిలేషన్‌షిప్ | 05 |
మొత్తం | 58 |
అర్హతలు :
Bank of Baroda Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతుంది.
- చీఫ్ మేనేజర్: ఎకనామిక్స్/కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. CA/MBA ఉంటే ప్రాధాన్యం + 8 ఏళ్ల బ్యాంకింగ్ లేదా బ్రోకరేజ్ అనుభవం ఉండాలి.
- మేనేజర్ – ట్రేడ్ ఫైనాన్స్: ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ తప్పనిసరి. ఫారెక్స్/IIBF సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యం. + కనీసం 2 ఏళ్ల అనుభవం అవసరం.
- మేనేజర్ – ఫారెక్స్ రిలేషన్‌షిప్: డిగ్రీ తప్పనిసరి. MBA/PGDM ఉంటే మంచిది. + కనీసం 2 ఏళ్ల అనుభవం అవసరం.
- సీనియర్ మేనేజర్ – ఫారెక్స్ రిలేషన్‌షిప్: డిగ్రీ + MBA/PGDM తప్పనిసరి. + కనీసం 5 ఏళ్ల అనుభవం అవసరం, అందులో 3 ఏళ్లు ట్రేడ్ ఫైనాన్స్‌లో ఉండాలి.
వయోపరిమితి :
Bank of Baroda Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
- మేనేజర్(ట్రేడ్ ఫైనాన్స్) : 24 నుంచి 34 సంవత్సరాలు
- మేనేజర్ (ఫారెక్స్ రిలేషన్ షిప్) : 26 నుంచి 36 సంవత్సరాలు
- సీనియర్ మేనేజర్ : 29 నుంచి 39 సంవత్సరాలు
- చీఫ్ మేనేజర్ : 30 నుంచి 40 సంవత్సరాలు
- రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Bank of Baroda Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : ₹850/-
- SC / ST / PWD / మహిళా అభ్యర్థులు : ₹175/-
ఎంపిక ప్రక్రియ:
Bank of Baroda Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- సైకోమెట్రిక్ టెస్ట్
- గ్రూప్ డిస్కషన్
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు :
Bank of Baroda Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులుకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- MMG/S-II: ₹64,820 – ₹93,960/-
- MMG/S-III: ₹85,920 – ₹1,05,280/-
- SMG/S-IV: ₹1,02,300 – ₹1,20,940/-
- అదనంగా HRA, DA, ఇతర అలవెన్సులు లభిస్తాయి.
దరఖాస్తు విధానం :
Bank of Baroda Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.bank.in లోకి వెళ్లాలి.
- Career → Current Opportunities విభాగంలో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.
- అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- అవసరమైన పత్రాలు (ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అనుభవ పత్రాలు) అప్‌లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 19 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 09 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
4 thoughts on “Bank of Baroda Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్ – జీతం రూ.1.2 లక్షల వరకు!”