BEML Junior Executive Recruitment 2025 : భారత రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రముఖ సంస్థ BEML Limited దేశవ్యాప్తంగా ఉన్న తన తయారీ యూనిట్లు మరియు వ్యాపార కేంద్రాలలో Junior Executives (JE) పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.ఇంజనీరింగ్, ఫైనాన్స్, IT, రాజభాష వంటి విభాగాల్లో మొత్తం 119 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

BEML Junior Executive Recruitment 2025 Overview
నియామక సంస్థ | BEML Limited |
పోస్టు పేరు | జూనియర్ ఎగ్జిక్యూటివ్ |
పోస్టుల సంఖ్య | 119 |
దరఖాస్తులకు చివరి తేదీ | 26 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : RRC NCR Apprentice Recruitment 2025 | రైల్వే శాఖలో మరో భారీ నోటిఫికేషన్ – 1763 ఖాళీలు
ఖాళీల వివరాలు :
BEML Limited నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఐటీ మరియు రాజభాష వంటి విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 119 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ | 88 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ | 18 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెటలర్జీ | 2 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఐటీ | 1 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ | 8 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాజభాష | 2 |
మొత్తం | 119 |
అర్హతలు :
BEML Junior Executive Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వురుగా ఉంటాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
- మెకానికల్ : మెకానికల్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో BE / B.Tech ఉత్తీర్ణత సాధించాలి.
- ఎలక్ట్రికల్ : ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో BE / B.Tech ఉత్తీర్ణత.
- మెటలర్జీ : మెటలర్జీ ఇంజనీరింగ్ లో కనీసం 60% మార్కులతో BE / B.Tech ఉత్తీర్ణత.
- ఐటీ : కంప్యూటర్ సైన్స్ / ఐటీలో కనీసం 60% మార్కులతో BE / B.Tech లేదా MCA
- ఫైనాన్స్ : CA / CMA లేదా MBA
- రాజభాష : MA Hindi లేదా MA English + హిందీ టైపింగ్ + కంప్యూటర్ స్కిల్స్
వయోపరిమితి :
BEML Junior Executive Recruitment 2025 అభ్యర్థులకు 26.09.2025 నాటికి 29 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BEML Junior Executive Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- GEN / OBC / EWS: ₹500/-
- SC/ST/PwD: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
BEML Junior Executive Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష : సంబంధిత సబ్జెక్ట్, రీజనింగ్ మరియు ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల సమయం ఉంటుంది. రాత పరీక్ష అన్ని విభాగాల వారికి ఉంటుంది.
- టైపింగ్ టెస్ట్ (రాజభాష పోస్టులకు మాత్రమే)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
జీతం వివరాలు :
BEML Junior Executive Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- 1వ సంవత్సరం: ₹35,000/-
- 2వ సంవత్సరం: ₹37,500/-
- 3వ సంవత్సరం: ₹40,000/-
- 4వ సంవత్సరం: ₹43,000/-
దరఖాస్తు విధానం :
BEML Junior Executive Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.bemlindia.in ని సందర్శించాలి.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ :
- 26 సెప్టెంబర్ 2025, సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- చివరి రోజున వెబ్‌సైట్ బిజీ అవ్వవచ్చు కాబట్టి ముందుగానే అప్లై చేయడం మంచిది.
ముఖ్య సూచనలు :
- ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
- దరఖాస్తు లో ఇచ్చిన e-mail & mobile number ఒక సంవత్సరం పాటు యాక్టివ్ గా ఉండాలి.
- దరఖాస్తు పూర్తయ్యాక డౌన్‌లోడ్/ప్రింట్ తీసుకుని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచుకోవాలి.
- అసంపూర్ణ దరఖాస్తులు లేదా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : BEL CRL Recruitment 2025 | ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
2 thoughts on “BEML Junior Executive Recruitment 2025 | BEMLలో JE పోస్టులకు నోటిఫికేషన్”