APPSC Hostel Welfare Officer Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి మరో నోటిఫికేషన్ వెలువడింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో జిల్లా స్థాయిలో ఒక పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టు మహిళల కోసం కేటాయించబడింది. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టు భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 01 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. ఈ ఒక్క పోస్టు కూడా మహిళలకు కేటాయించారు. ఒక పోస్టే కదా అని అనుకోకుండా.. ఆసక్తి ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోండి.. ఎందుకంటే అవకాశాలు ఎలా వస్తాయో చెప్పలేము.
- పోస్టు పేరు : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
- పోస్టుల సంఖ్య : 01
Also Read : APPSC Junior Lecturer Notification 2025 | ఏపీలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు
అర్హతలు :
APPSC Hostel Welfare Officer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు మహిళ అభ్యర్థి అయి ఉండాలి. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- డిగ్రీ పాసై ఉండాలి.
- మహిళ అభ్యర్థి అయి ఉండాలి.
వయోపరిమితి :
APPSC Hostel Welfare Officer Recruitment 2025 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APPSC Hostel Welfare Officer Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General/OBC అభ్యర్థులకు: ₹250 (ప్రాసెసింగ్ ఫీజు) + ₹80 (ఎగ్జామ్ ఫీజు)
- SC, ST, BC, PH, Ex-Servicemen అభ్యర్థులకు : ₹250 (ప్రాసెసింగ్ ఫీజు) మాత్రమే. ఎగ్జామ్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
APPSC Hostel Welfare Officer Recruitment 2025 అభ్యర్థి ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
- Paper-I: General Studies & Mental Ability (150 Marks)
- Paper-II: Subject (Education) (150 Marks)
- ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగటివ్ మార్కులు ఉంటాయి.
Also Read : APPSC AEE Recruitment 2025 | రూ.90 వేల జీతంతో గ్రామీణ నీటి సరఫరా శాఖలో AEE పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
APPSC Hostel Welfare Officer Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ₹37,640 – ₹1,15,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APPSC Hostel Welfare Officer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు APPSC అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లోకి వెళ్లాలి.
- OTPR (One Time Profile Registration) చేయాలి లేదా ఇప్పటికే రిజిస్ట్రేషన్ ఉన్నవారు login కావాలి.
- Hostel Welfare Officer Recruitment 2025 లింక్ని ఎంచుకొని అప్లికేషన్ ఫారం నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి, ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 సెప్టెంబర్, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 07 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
1 thought on “APPSC Hostel Welfare Officer Recruitment 2025 | ఏపీలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్”