IOB SO Recruitment 2025 : ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా MMG స్కేల్-2 మరియు స్కేల్-3లో స్పెషలిస్ట్్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 127 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

IOB SO Recruitment 2025 Overview:
| వివరాలు | సమాచారం |
| సంస్థ పేరు | Indian Overseas Bank (IOB) |
| పోస్టు పేరు | Specialist Officers (SO) |
| ఖాళీలు | 127 |
| స్థాయి | MMGS II & MMGS III |
| దరఖాస్తు ప్రారంభం | 12.09.2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 03.10.2025 |
| వెబ్సైట్ | www.iob.in |
Also Read : SBI SCO Recruitment 2025 Out | స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు :
Indian Overseas Bank (IOB) ఒక ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. చెన్నైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ఈ బ్యాంక్ Specialist Officers (SO) Recruitment 2025-26 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 127 ఖాళీలు వివిధ విభాగాల్లో ఉన్నాయి.
| పోస్టు పేరు | ఖాళీలు |
| మేనేజర్ (IS Audit) | 8 |
| సీనియర్ మేనేజర్ (IS Audit) | 2 |
| మేనేజర్ (Civil) | 5 |
| మేనేజర్ (Architect) | 3 |
| మేనేజర్ (Electrical) | 1 |
| మేనేజర్ (Automobile) | 1 |
| మేనేజర్ (Printing) | 1 |
| మేనేజర్ (Treasury) | 11 |
| మేనేజర్ (Corporate Credit) | 6 |
| సీనియర్ మేనేజర్ (Corporate Credit) | 4 |
| మేనేజర్ – IT | 41 |
| సీనియర్ మేనేజర్ – IT | 4 |
| మేనేజర్ – Risk | 5 |
| సీనియర్ మేనేజర్ – Risk | 5 |
| మేనేజర్ – Information Security | 13 |
| సీనియర్ మేనేజర్ – Information Security | 2 |
| మేనేజర్ – Software Engineer (Mobile Apps) | 2 |
| సీనియర్ మేనేజర్ – Software Engineer (Mobile Apps) | 1 |
| మేనేజర్ – Software Engineer (Automation Engg.) | 2 |
| మేనేజర్ – Software Engineer (Dot Net Tech) | 2 |
| మేనేజర్ – Software Engineer (Java Tech) | 2 |
| మేనేజర్ – Software Engineer (ML Ops Engg.) | 2 |
| మేనేజర్ – Data Scientist | 1 |
| సీనియర్ మేనేజర్ – Data Scientist | 1 |
| మేనేజర్ – Data Engineer | 1 |
| సీనియర్ మేనేజర్ – Data Engineer | 1 |
మొత్తం ఖాళీలు: 127
అర్హతలు :
IOB SO Recruitment 2025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు విద్యార్హతలు పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటాయి.
- విద్యార్హతలు: పోస్టును బట్టి BE/B.Tech/MCA/M.Sc./MBA/CA ఉత్తీర్ణత సాధించాలి (పోస్ట్ వైజ్ అర్హతలు నోటిఫికేషన్లో వివరంగా ఉన్నాయి).
- అనుభవం: కనీసం 2 నుండి 10 సంవత్సరాల అనుభవం పోస్టు ఆధారంగా అవసరం.
వయోపరిమితి :
IOB SO Recruitment 2025 అభ్యర్థులు వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది.
- Manager (Scale II): 25 – 35 సంవత్సరాలు
- Senior Manager (Scale III): 30 – 40 సంవత్సరాలు
- SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు, PwBD – 10 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IOB SO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- SC/ST/PwBD: ₹175/-
- ఇతర వర్గాలు (OBC, EWS, General): ₹1000/-
ఎంపిక ప్రక్రియ :
IOB SO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ఆన్లైన్ పరీక్ష
- English Language – 25 ప్రశ్నలు
- General Awareness (Banking) – 25 ప్రశ్నలు
- Professional Knowledge – 50 ప్రశ్నలు
- మొత్తం: 100 ప్రశ్నలు, 100 మార్కులు, 2 గంటలు
- ఇంటర్వ్యూ
Also Read : IFSCA Recruitment 2025 | భారీ జీతంతో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
IOB SO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.
- MMGS II: ₹64,820 – ₹93,960
- MMGS III: ₹85,920 – ₹1,05,280
- అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు లభిస్తాయి.
- ఎంపికైన అభ్యర్థులు 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ లో పనిచేయాలి.
దరఖాస్తు విధానం :
IOB SO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు IOB Careers Portal లోకి వెళ్లాలి.
- “Recruitment of Specialist Officers – 2025-26” లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్తగా రిజిస్టర్ చేసుకొని అవసరమైన వివరాలు నింపాలి.
- ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
- చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 12 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 03 అక్టోబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRC SR Sports Quota Recruitment 2025 | దక్షిణ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్
1 thought on “IOB Specialist Officers Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్”