Canara Bank Securities Recruitment 2025 కెనరా బ్యాంకు అనుబంధ సంస్థ అయిన Canara Bank Securities లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ (సేల్స్ అండ్ మార్కెటింగ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో ఈ నియామకాలు జరుగనున్నాయి. ఫైనాన్స్ సర్వీసులు, స్టాక్ బ్రోకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 06వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

Canara Bank Securities Recruitment 2025 Overview
నియామక సంస్థ | కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL) |
పోస్టు పేరు | ట్రైనీ (సేల్స్ అండ్ మార్కెటింగ్) |
పోస్టుల సంఖ్య | నోటిఫికేషన్ లో ప్రకటించలేదు |
అర్హతలు | ఏదైనా డిగ్రీ |
వయస్సు | 20 – 30 సంవత్సరాలు |
దరఖాస్తులకు చివరి తేదీ | 06 అక్టోబర్, 2025 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
Also Read : IOCL Engineer Recruitment 2025 | రూ.17.7 లక్షల ప్యాకేజీతో IOCLలో ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
కెనరా బ్యాంక్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్్ నుంచి ట్రైనీ(సేల్స్ అండ్ మార్కెటింగ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్య ప్రత్యేకంగా ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
అర్హతలు :
Canara Bank Securities Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కనీసం 50% మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫిషెన్సీ ఉండాలి.
- అనుభవం : Sales/Marketing లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. Freshers కూడా అప్లై చేయవచ్చు.
వయోపరిమితి :
Canara Bank Securities Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- 20 నుంచి 30 సంవత్సరాలు
- Sales & Marketing లో అనుభవం ఉన్న వారికి వయోపరిమితిలో 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Canara Bank Securities Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
Canara Bank Securities Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ స్క్రీనింగ్
- ఇంటర్వ్యూ (ఆన్ లైన్ / ఆఫ్ లైన్) : షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : Shipping Corporation of India Recruitment 2025 | భారీ జీతంతో అసిస్టెంట్ మేనేజర్ & ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జీతం వివరాలు :
Canara Bank Securities Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,000/- వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. పనితీరు ఆధారంగా నెలకు రూ.2,000/- వేరియబుల్ పే ఇస్తారు.
దరఖాస్తు విధానం :
Canara Bank Securities Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.
ఆన్ లైన్ విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.canmoney.in/careers సందర్శించాలి.
- వ్యక్తిగత మరియు విద్యా వివరాలతో రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి.
ఆఫ్ లైన్ విధానం :
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ ని డౌన్ లోడ్ చేసుకోండి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా పూరించండి.
- అవసరమైన పత్రాల స్వీయ ధ్రువీకరించిన కాపీలను జత చేయండి.
- అప్లికేషన్ ని కింది చిరునామాకు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన చిరునామా :
- జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, మేకర్ చాంబర్-3, నారిమన్ పాయింట్, ముంబై-400021
దరఖాస్తులకు చివరి తేదీ : 06 అక్టోబర్, 2025 సాయంత్రం 6:00 గంటల లోపు
Notification | Click here |
Application form | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
Also Read : AP Asha Worker Notification 2025 | గ్రామ సచివాలయంలో ఆశ వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్