TIFR Clerk Recruitment 2025 హైదరాబాద్ లో ఉన్నా టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, క్లర్క్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 07 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీలోపు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు సమర్పించాలి.
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిధిలోని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR), హైదరాబాద్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, క్లర్క్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 07 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు. ఎంపికైతే హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్న వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి.
| పోస్టు పేరు | ఖాళీలు |
| అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | 01 |
| క్లర్క్ ట్రైనీ | 06 |
| మొత్తం | 07 |
అర్హతలు :
TIFR Clerk Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
| పోస్టు పేరు | అర్హతలు |
| అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ / మేనేజ్మెంట్ లేదా అడ్మినిస్ట్రేషన్ లో డిప్లొమా / డిగ్రీ / సర్టిఫికెట్ కోర్స్ + 5 సంవత్సరాల అనుభవం |
| క్లర్క్ ట్రైనీ | ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ టైపింగ్ మరియు కంప్యూటర్ అండ్ అప్లికేషన్ లో స్కిల్స్ ఉండాలి |
వయస్సు :
TIFR Clerk Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది.
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 40 సంవత్సరాలు
- క్లర్క్ ట్రైనీ : 28 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ:
TIFR Clerk Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- ఇంటర్వ్యూ
క్లర్క్ ట్రైనీ :
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
జీతం వివరాలు :
TIFR Clerk Recruitment 2025 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,14,945/- జీతం ఇవ్వడం జరుగుతుంది. క్లర్క్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో రూ.22,000/- స్టైఫండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
TIFR Clerk Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తు :
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- పోస్టును సెలెక్ట్ చేసుకొని అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.
ఆఫ్ లైన్ లో దరఖాస్తు :
- ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- దాని ప్రింట్ కాపీని కింది అడ్రస్ కి పోస్టు ద్వారా పంపాలి.
- అడ్రస్ : హెడ్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సర్వే నెంబర్ 36/P, గోపన్ పల్లి విలేజ్, సెరిలింగంపల్లి మండల్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ -500046
- పోస్టును సెప్టెంబర్ 5వ తేదీలోపు చేరేలా పంపాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 05 సెప్టెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |