IOB Apprentice Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 750 అప్రెంటిస్ పోస్టులు

IOB Apprentice Recruitment 2025 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 750 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000/- స్టైపండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

IOB Apprentice Recruitment 2025 Overview

నియామక సంస్థఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 
పోస్టు పేరుఅప్రెంటీస్
పోస్టుల సంఖ్య750 
దరఖాస్తు ప్రక్రియ10 ఆగస్టు – 20 ఆగస్టు, 2025
జాబ్ లొకేషన్ఆల్ ఇండియా
స్టైఫండ్నెలకు రూ.15,000/-

పోస్టుల వివరాలు : 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 750 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 

  • పోస్టు పేరు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
  • పోస్టుల సంఖ్య : 750

అర్హతలు : 

IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
  • డిగ్రీ ఫలితలు 01 ఏప్రిల్, 2021 మరియు 01 ఆగస్టు, 2025 మధ్య వచ్చి ఉండాలి. 
  • ఇతర సంస్థలో అప్రెంటిస్ షిప్ శిక్షణ తీసుకున్న వారు అనర్హులు.

వయస్సు : 

IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.944/-
  • ఎస్సీ / ఎస్టీ / మహిళలు : రూ.708/-
  • పీడబ్ల్యూబీడీ : రూ.472/-

ఎంపిక ప్రక్రియ: 

IOB Apprentice Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • స్థానిక భాష పరీక్ష

జీతం వివరాలు : 

IOB Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ అందజేస్తారు. 

  • మెట్రో బ్రాంచిలు : నెలకు రూ.15,000/-
  • అర్బన్ బ్రాంచిలు : నెలకు రూ.12,000/-
  • సెమీ అర్బన్ / గ్రామీణ బ్రాంచిలు : రూ.10,000/-

దరఖాస్తు విధానం : 

IOB Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు https://bfsissc.com/ వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ పేజీకి నావిగేట్ చేయాలి. 
  • IOB Apprentice Program FY 2025-26 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • ఆన్ అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • NATS / NAPS రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. 
  • ఫీజు చెల్లించేందుకు BFSI SSC నుంచి ఈమెయిల్ వస్తుంది. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 20 ఆగస్టు, 2025
NotificationClick here
Apply OnlineClick here
NATS Portal LinkClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!