IBPS Clerk Recruitment 2025 | బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

 IBPS Clerk Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి మరియు అర్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఆగస్టు 21వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోగలరు. 

IBPS Clerk Recruitment 2025 Overview: 

నియామక సంస్థఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పన్సనల్ సెలక్షన్(IBPS)
పోస్టు పేరు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (క్లర్క్)
పరీక్ష పేరుCRP CSA XV
దరఖాస్తు ప్రక్రియ01 ఆగస్టు – 21 ఆగస్టు, 2025
ఎంపిక ప్రక్రియప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ వెరిపికేషన్

ఖాళీల వివరాలు : 

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఖాళీల సంఖ్యను ప్రకటించలేదు. వివరాలు త్వరలోనే అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేస్తారు. 

అర్హతలు : 

IBPS Clerk Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి : 

IBPS Clerk Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IBPS Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.850/-
  • ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూడీ / ఎక్స్ సర్వీస్ మెన్ : రూ.175/-

ఎంపిక ప్రక్రియ: 

IBPS Clerk Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో ఉంటుంది. 

  • ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్)
  • మెయిన్స్ పరీక్ష ( ఆబ్జెక్టివ్ టెస్ట్)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

జీతం వివరాలు : 

IBPS Clerk Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్యాంకు నిబంధనల ప్రకారం జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IBPS Clerk Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజ చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 ఆగస్టు, 2025

1 thought on “IBPS Clerk Recruitment 2025 | బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!