BSF Constable Tradesman Recruitment 2025 బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్(ట్రేడ్స్ మెన్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,588 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ డ్రేడ్స్ మెన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడ్లలో మొత్తం 3,588 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో 3,406 పోస్టులు పురుష అభ్యర్థులకు, 182 పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించారు.
అర్హతలు :
BSF Constable Tradesman Recruitment 2025 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో రెండేళ్ల ఐటీఐ సర్టిఫికెట్ లేదా ఒక సంవత్సరం ఐటీఐతో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
- 10వ తరగతి + ఐటీఐ సర్టిఫికెట్
- (లేదా) ఒక సంవత్సరం ఐటీఐతో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
వయస్సు :
BSF Constable Tradesman Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BSF Constable Tradesman Recruitment 2025 జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.147/- మరియు ఎస్సీ / ఎస్టీ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళా అభ్యర్థులకు రూ.47/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
BSF Constable Tradesman Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- శారీరక ప్రమాణాల పరీక్ష
- శారీరక సామర్థ్య పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ట్రేడ్ టెస్ట్
- రాత పరీక్ష
- వైద్య పరీక్ష
జీతం వివరాలు :
BSF Constable Tradesman Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 – రూ.69,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
BSF Constable Tradesman Recruitment 2025 కానిస్టేబుల్ ట్రేడ్స్ మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 26 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 25 ఆగస్టు, 2025
NOTIFICATION : CLICK HERE
APPLY ONLINE : CLICK HERE
ok
10
10th pass
Ok
Reply
PALLOLLA CHIRANJEEVI
SATHYA SAI DISTRICT
NALLAMADA POST
NALLAMADA VILLAGE
NALLAMADA MANDAL
10TH PASS
FATHER NAME. CHINNAPPA