Kurnool Medical College Jobs 2025 కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జనరల్ డ్యూటీ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జులై 16వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ఫిజియోథెరపిస్ట్ (కాంట్రాక్ట్) | 02 |
స్పీచ్ థెరపిస్ట్ (కాంట్రాక్ట్) | 02 |
సి-ఆర్మ్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) | 02 |
ఓటీ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) | 02 |
డయాలసిస్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) | 02 |
జనరల్ డ్యూటీ అటెండెంట్ (ఔట్ సోర్సింగ్) | 08 |
ఈఈజీ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) | 02 |
ఆడియోమెట్రి టెక్నీషియన్ (కాంట్రాక్ట్) | 01 |
మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఔట్ సోర్సింగ్) | 11 |
ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (ఔట్ సోర్సింగ్) | 11 |
మొత్తం | 43 |
అర్హతలు :
Kurnool Medical College Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- ఫిజియోథెరపిస్ట్ : ఫిజియోథెరపిలో డిగ్రీ
- స్పీచ్ థెరపిస్ట్ : డిప్లొమా, బిఎస్సీ, బీఏఎస్ఎల్పీ
- సి-ఆర్మ్ టెక్నీషియన్ : డిప్లొమా, బీఎస్సీ
- ఓబీ టెక్నీషియన్ : డిప్లొమా
- ఈఈజీ టెక్నీషియన్ : 12వ తరగతి, బీఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా
- డయాలసిస్ టెక్నీషియన్ : 12వ తరగతి, డిప్లొమా, బీఎస్సీ
- జనరల్ డ్యూటీ అటెండెంట్ : 10వ తరగతి
- ఆడియోమెట్రీ టెక్నీషియన్ : 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఎఎస్ఎల్పీ
- నర్సింగ్ ఆర్డర్లీ (మేల్ & ఫీమేల్) : 10వ తరగతి
వయస్సు :
Kurnool Medical College Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Kurnool Medical College Jobs 2025 పోస్టులకు అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జనరల్ అభ్యర్థులకు : రూ.250/-
- SC/ST/BC/EWS/PED : రూ.200/-
ఎంపిక ప్రక్రియ:
Kurnool Medical College Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు :
Kurnool Medical College Jobs 2025 పోస్టును అనుసరించి జీతాలు ఇవ్వబడతాయి. జీతాల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- ఫిజియోథెరపిస్ట్ : రూ.35,370/-
- స్పీచ్ థెరపిస్ట్ : 40,970/-
- సీఆర్మ్ టెక్నీషియన్ : రూ.32,670/-
- ఓటీ టెక్నీషియన్ : రూ.32,670/-
- ఈఈజీ టెక్నీషియన్ : రూ.32,670/-
- డయాలసిస్ టెక్నీషియన్ : రూ.32,670/-
- ఆడియో మెట్రి టెక్నీషియన్ : రూ.32,670/-
- జనరల్ డ్యూటీ అటెండెంట : రూ.15,000/-
- నర్సింగ్ ఆర్డర్లీ (మేల్) : రూ.15,000/-
- నర్సింగ్ ఆర్డర్లీ (ఫీమేల్) : రూ.15,000/-
దరఖాస్తు విధానం:
Kurnool Medical College Jobs 2025 అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలు జత చేయాలి.
- అప్లికేషన్ పారమ్ ని కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి.
చిరునామా : ప్రిన్సిపాల్ కార్యాలయం, కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 09.07.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 16.07.2025
Notification | Click here |
Application Form | Click here |
Official Website | Click here |