By Jahangir

Published On:

Follow Us
IBPS SO Recruitment 2025

IBPS SO Recruitment 2025 | IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

IBPS SO Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 1,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జూలై 1వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

IBPS SO Recruitment 2025 overview : 

నియామక సంస్థఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS)
పోస్టు పేరుస్పేషలిస్ట్ ఆఫీసర్
ఖాళీల సంఖ్య1,007
జాబ్ లొకేషన్పాన్ ఇండియా
బ్యాంకులుబ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్  నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫీ ఇండియా

పోస్టుల వివరాలు : 

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) వివిధ బ్యాంకుల్లో స్పేషలిస్ట్  ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్టు పేరుఖాళీలు
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1)310
మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1)350
ఐటీ ఆఫీసర్ (స్కేల్-1)203
రాజ్ భాష అధికారి (స్కేల్-1)78
లా ఆఫీసర్ (స్కేల్-1)56
హెచ్ఆర్ / పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1)10

అర్హతలు : 

IBPS SO Recruitment 2025 స్పేషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు  చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

IBPS PO/MT Recruitment 2025
IBPS PO/MT Recruitment 2025 | వివిధ బ్యాంకుల్లో 5,208 పీఓ / మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్
పోస్టు పేరువిద్యార్హతలు
ఐటీ ఆఫీసర్BE / B.Tech / PG
అగ్రికల్చర్ ఆఫీసర్అగ్రికల్చర్ / ఉద్యానవన శాస్త్రం / పశుసంవర్ధకం / వెటర్నరీ సైన్స్ / డెయిరీ సైన్స్ /ఫిషరీ సైన్స్ / పిస్కల్చర్ /అగ్రి.మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ / కో-ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్ / ఆగ్రో-ఫారెస్ట్రీ / ఫారెస్ట్రీ / అగ్రి కల్చరల్ బయోటెక్నాలజీ / ఫుడ్ సైన్స్ / అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ / ఫుడ్ టెక్నాలజీ / డెయిరీ టెక్నాలజీ  / అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ / సెరికల్చర్ /ఫిషరీస్ ఇంజనీరింగ్ లో 4  సంవత్సరాల డిగ్రీ 
రాజ భాష అధికారిడిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా తీసుకొని హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (లేదా) డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ మరియు హిందీ సబ్జెక్టులుగా సంస్కృతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
లా ఆఫీసర్న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ (ఎల్ఎల్బి) మరియు బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకోవాలి
హెచ్ఆర్ / పర్సనల్ ఆఫీసర్గ్రాడ్యుయేట్ మరియు రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పర్సనల్ మేనేజ్మెంట్ / ఇండస్ట్రియల్ రిలేషన్స్ / హెచ్ఆర్ / హెచ్ఆర్డీ / సోషల్ వర్క్ / లేబర్ లాలో రెండేళ్ల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా
మార్కెటింగ్ ఆఫీసర్MMS / MBA / PGDBA / PGDBM / PGPM / PGDM

వయోపరిమితి : 

IBPS SO Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IBPS SO Recruitment 2025 పోస్టులకు ఆన్ లైన్ విధానంలో డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / యూపీఐ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

  • UR / EWS / OBC : రూ.850/-
  • SC / ST / PwD : రూ.175/- 

ఎంపిక ప్రక్రియ: 

IBPS SO Recruitment 2025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • ప్రిలిమినరీ ఎగ్జామ్
  • మెయిన్స్ ఎగ్జామ్
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు : 

IBPS SO Recruitment 2025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని కలుపుకుని నెలకు రూ.75,000/- జీతం ఉంటుంది. 

Dhanlaxmi Bank Recruitment 2025
Dhanlaxmi Bank Recruitment 2025 | ధనలక్ష్మీ బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

దరఖాస్తు విధానం : 

IBPS SO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • హోమ్ పేజీలో ‘CRP SO’ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేసన్ నంబర్ మరియు పాస్ వర్డ్ ద్వారా ప్రాథమిక వివరాలను నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01 జూలై,  2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 21 జూలై,2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!