RITES Site Assessor recruitment 2025 రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్(RITES) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ అసెస్సర్, రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 27వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవాలి.
RITES recruitment 2025 Overview :
నియామక సంస్థ | రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామికల్ సర్వీసెస్(RITES) |
పోస్టు పేరు | సైట్ అసెస్సర్, అసిస్టెంట్ మేనేజర్ |
పోస్టుల సంఖ్య | 20 |
జీతం | రూ.25,120/-, రూ.40,000 – రూ.1,40,000/- |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తులకు చివరి తేదీ | 27 జూలై, 2025 |
అర్హతలు | 10వ తరగతి + ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ / బీటెక్, మాస్టర్ డిగ్రీ |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్, రెగ్యులర్ |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష / ఇంటర్వ్యూ |
పోస్టుల వివరాలు :
రైట్స్ లిమిటెడ్ నుంచి సైట్ అసెస్సర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సైట్ అసెస్సర్ (కాంట్రాక్ట్) | 06 |
అసిస్టెంట్ మేనేజర్ (రెగ్యులర్) | 14 |
అర్హతలు :
RITES recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
సైట్ అసెస్సర్ :
- 10వ తరగతి + ఎలక్ట్రికల్ / ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ / ఎలక్ట్రీషియన్ మెకానికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ మెకానిక్ / టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ / ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ లో ITI
- సోలార్ పీవీ వ్యవస్థలలో 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ :
- డిప్లొమా, డిగ్రీ, బీఈ / బీటెక్, మాస్టర్స్ డిగ్రీ
- సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు :
RITES recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- సైట్ అసెస్సర్ : 40 సంవత్సరాలు
- అసిస్టెంట్ మేనేజర్ : 32 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
RITES recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సైట్ అసెస్సర్ పోస్టులకు: అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు రాత పరీక్ష / ఇంటర్వ్యూ తర్వాత ఫీజు రీఫండ్ చేయడం జరుగుతుంది.
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు : జనరల్ / ఓబీసీ అభ్యర్థులు రూ.600/- మరియు ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.300/- ఫీజు చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
RITES recruitment 2025 పోస్టులకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ (అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు)
జీతం వివరాలు :
RITES recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతాలు ఉంటాయి.
- సైట్ అసెస్సర్ : రూ.25,120/-
- అసిస్టెంట్ మేనేజర్ : రూ.40,000 – రూ.1,40,000/-
దరఖాస్తు విధానం :
RITES recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 27 జూలై, 2025
Site Assessor Notification | Click here |
Assistant Manager Notification | Click here |
Apply Online | Click here |