By Jahangir

Published On:

Follow Us
SSC CHSL Recruitment 2025

SSC CHSL Recruitment 2025 | 12వ తరగతి అర్హతతో 3,131 గవర్నమెంట్ జాబ్స్

SSC CHSL Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. 12వ తరగతి అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 3,131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

SSC CHSL Recruitment 2025 Overview : 

నియామక సంస్థస్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)
పోస్టు పేరులోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆఫరేటర్
పోస్టుల సంఖ్య3,131
అర్హతఇంటర్ పాస్
దరఖాస్తులకు చివరి తేదీ18 జూలై, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

పోస్టుల వివరాలు : 

12వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారి కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఓ బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శఆఖలు, విభాగాలు మరియు ఆఫీసుల్లో లోయర్ డివిజన్ క్లర్క్(LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(JSA), డేటా ఎంట్రీ ఆఫరేటర్(DEO) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3,131 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

  • మొత్తం పోస్టుల సంఖ్య : 3131

అర్హతలు : 

SSC CHSL Recruitment 2025 లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

CDAC Project Staff Recruitment 2025
CDAC Project Staff Recruitment 2025 | CDAC ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇంజనీర్ ఉద్యోగాలు
  • 12వ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి : 

SSC CHSL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 01 – 01 – 2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు 02 – 01 – 1999 కంటే ముందు మరియు 01 – 01 – 2008 తర్వాత జన్మించి ఉండకూడదు. 

  • 18 నుంచి 27 సంవత్సరాలు
  • వయోసడలింపు : SC / ST : 5 సంవత్సరాలు, ఓబీసీ : 3 సంవత్సరాలు 

అప్లికేషన్ ఫీజు : 

SSC CHSL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిఫీజు
General / OBC / EWSరూ.100/-
SC / ST / PwD / ExSm / Womenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

SSC CHSL Recruitment 2025 లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

ISRO ICRB Scientist Engineer Jobs 2025
ISRO ICRB Scientist Engineer Jobs 2025 | ఇస్రోలో ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • రాత పరీక్ష (టైర్-1 + టైర్-2)
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

పే స్కేల్ వివరాలు : 

SSC CHSL Recruitment 2025 పోస్టులకు పే స్కేల్ వివరాలు కింది విధంగా ఉంటాయి. 

పోస్టు పేరుపే స్కేల్
లోయర్ డివిజన్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్రూ.19,900 – రూ.63,200/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ (లెవల్ -4 & లెవల్-5)రూ.25,500 – రూ.81,100 మరియు రూ.29,200 – రూ.92,300/-
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ‘ఎ’రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు విధానం : 

SSC CHSL Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 
  • లేటెస్ట్ నోటిఫికేషన్ లో వెళ్లి SSC CHSL లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • వెబ్ క్యామ్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా లైవ్ ఫొటో గ్రాఫ్ ను క్యాప్చర్ చేయాలి. ఆ తర్వాత సంతకాన్ని అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేదీ23 జూన్, 2025
దరఖాస్తులకు చివరి తేదీ18 జూలై, 2025
ఆన్ లైన్  ఫీజు చెల్లింపునకు చివరి తేదీ19 జూలై,  2025
అప్లికేషన్ ఫారమ్ కరెక్షన్ విండో23 జూలై, 2025 నుంచి 24 జూలై,  2025
టైర్-1 పరీక్ష08 సెప్టెంబర్ నుంచి 18 సెప్టెంబర్, 2025
టైర్-2 పరీక్షఫిబ్రవరి – మార్చి 2025
NotificationClick here
Apply Online Click here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!