Pawan Hans Recruitment 2025 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 21వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Pawan Hans Recruitment 2025 Overview :
నియామక సంస్థ పేరు | పవన్ హన్స్ లిమిటెడ్ |
పోస్టు పేరు | గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, అసోసియేట్ క్యాబిన్ స్టాఫ్, అసోసియేట్ ఫ్లయిట్ ఇంజనీర్, మేనేజర్, జనరల్ మేనేజర్(ఇంజనీరింగ్) |
పోస్టుల సంఖ్య | 33 |
జీతం | రూ.50,000 – రూ.2,60,000/- |
జాబ్ లొకేషన్ | భారతదేశం అంతా |
జాబ్ కేటగిరి | రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్ |
పోస్టుల వివరాలు :
భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న మినీరత్న-1 కేటగిరీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ | మెకానికల్ ఇంజనీరింగ్ – 6ఏరోనాటికల్ ఇంజనీరింగ్ – 6ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 4ఏవియానిక్స్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్ – 4 |
అసోసియేట్ క్యాబిన్ స్టాఫ్ | 05 |
అసోసియేట్ ఫ్లయిట్ ఇంజనీర్ | 05 |
మేనేజర్ | 02 |
జనరల్ మేనేజర్ | 01 |
అర్హతలు :
Pawan Hans Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి 12వ తరగతి, BE / B.Tech, MBA, ME / M.Tech పూర్తి చేసి ఉండాలి.
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ : బీఈ / బీటెక్, ఎంఈ / ఎంటెక్ + గేట్ 2025 స్కోర్ కార్డు
- అసోసియేట్ క్యాబిన్ స్టాఫ్ : నిబంధన ప్రకారం
- అసోసియేట్ ఫ్లయిట్ ఇంజనీర్ : 12వ తరగతి
- మేనేజర్ : బీఈ / బీటెక్
- జనరల్ మేనేజర్ : బీఈ / బీటెక్, ఎంబీఏ, ఎంఈ / ఎంటెక్
వయస్సు :
Pawan Hans Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, అసోసియేట్ క్యాబిన్ స్టాఫ్, అసోసియేట్ ఫ్లయిట్ ఇంజనీర్ పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- మేనేజర్ పోస్టులకు : 40 సంవత్సరాలు
- జనరల్ మేనేజర్ పోస్టులకు : 50 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు :
Pawan Hans Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే UR / OBC / EWS అభ్యర్థులు రూ.295/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC / ST / PwBD అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాలి. Pawan Hans Limited payable at Delhi/Noida పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట తీయాలి.
ఎంపిక ప్రక్రియ :
Pawan Hans Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
Pawan Hans Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి పేస్కేల్ ఇవ్వడం జరుగుతుంది.
- గ్రాడ్యుయేట ఇంజనీర్ ట్రైనీ : రూ.50,000/-
- అసోసియేట్ క్యాబిన్ స్టాఫ్ : రూ.95,000 – రూ.1,65,000/-
- అసోసియేట్ ఫ్లయిట్ ఇంజనీర్ : రూ.2,00,000 – రూ.3,50,000/-
- మేనేజర్ : రూ.50,000 – రూ.1,60,000/-
- జనరల్ మేనేజర్ : రూ.1,00,000 – రూ.2,60,000/-
దరఖాస్తు విధానం :
Pawan Hans Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది.
- పోస్టు ప్రకటన లింక్ పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అందులో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసి, ఫ్రింట్ తీసుకోవాలి.
- ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ హార్డ్ కాపీ, అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ని కింద ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
హెడ్(HR), పవన హన్స్ లిమిటెడ్(భారత ప్రభుత్వ సంస్థ), కార్పొరేట్ ఆఫీస్, C-14, సెక్టార్-1, నోయిడా-201301, ఉత్తరప్రదేశ్.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 21 – 06 – 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 – 07 – 2025
Notification | Click here |
Apply Online | Click here |