By Jahangir

Published On:

Follow Us
CSIR NAL Technician Jobs 2025

CSIR NAL Technician Jobs 2025 | నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

CSIR NAL Technician Jobs 2025 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ ( NAL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం  86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

CSIR NAL Technician Jobs 2025

పోస్టుల వివరాలు : 

కౌన్సిల ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ. బెంగళూరులోని CSIR నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుంచి టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సంస్థ అన్ని ఏరోస్పేస్ విభాగాల్లో అద్భుతమైన సౌకర్యాలకు మరియు పారిశ్రామిక అనువర్తనాల కోసం ఏరోస్పేస్ టెక్నాలజీల రీసెర్చ్ కి ప్రసిద్ధి చెందింది. 

  • సంస్థ పేరు : CSIR NAL 
  • పోస్టు పేరు : టెక్నీషియన్-1
  • పోస్టుల సంఖ్య : 86
  • జాబ్ లొకేషన్ : బెంగళూరు

రిజర్వేషన్ల వారీగా పోస్టుల ఖాళీలు :

కేటగిరీఖాళీలు
జనరల్30
OBC27
EWS08
SC15
ST06
మొత్తం పోస్టులు86

అర్హతలు : 

CSIR NAL Technician Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా నేషనల్ / స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.  

SSC JE Recruitment 2025
SSC JE Recruitment 2025 | SSC జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

వయోపరిమితి : 

CSIR NAL Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

CSIR NAL Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBC / EWSరూ.500/-
SC / ST / PwBD / Women / EsMఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

CSIR NAL Technician Jobs 2025 పోస్టులకు ట్రేడ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

  • ట్రేడ్ టెస్ట్ : అభ్యర్థులను ముందుగా వారి అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్ కి పిలుస్తారు. 
  • రాత పరీక్ష : ట్రేడ్ టెస్ట్ లో అర్హత సాధించిన వారికి రాత పరీక్షకు పిలుస్తారు. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. 2.30 గంటల సమయం ఇస్తారు. మొత్తం 400 మార్కలకు పరీక్ష ఉంటుంది. 

రాత పరీక్ష విధానం: 

  • పేపర్-1 : ఇందులో మెంటల్ ఎబిలిటీ పై 50 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్షకు 1 గంట సమయం ఇస్తారు. 
  • పేపర్-2 :  ఈ పేపర్ లో జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు, 75 మార్కులు), ఇంగ్లీస్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు, 75 మార్కులు) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. ఈ పేపర్ లో కేవలం 30 నిమిషాల సమయం ఇస్తారు.  
  • పేపర్-3: సంబంధిత ట్రేడ్ పై 50 ప్రశ్నలు అడుగుతారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. 1 గంటల సమయం ఇస్తారు. 

జీతం వివరాలు : 

CSIR NAL Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-2 ప్రకారం రూ.19,900 – రూ.63,200/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. DA, HRA & TA కలుపుకుని సుమారు రూ.38,500/- జీతం ఇస్తారు. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు

దరఖాస్తు విధానం : 

CSIR NAL Technician Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ముందుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. 
  • అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : జూన్ 6, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : జూలై 10, 2025
NotificationClick here
Apply Online Click here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!