AP Inter Supplementary Results 2025 ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏపీ ఇంటర్ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన సంగతి తెలసిందే.. ఇంటర్ ఫెయిల్ అయిన వారు మరియు మార్కులు పెంచుకోవాలని పరీక్షలు రాసిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో విద్యాశాఖ నుంచి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. శనివారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల అవుతున్నాయి.
Check AP Inter Supplementary Results 2025:
ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి విడుదల చేస్తుంది. ఫలితాలను కింది స్టెప్స్ ఫాలో అయ్యి తెలుసుకోవచ్చు.
- విద్యార్థులు ఏపీ ఇంటర్ అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో ‘AP IPE Results 2025’ పై క్లిక్ చేయాలి.
- ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయాలి.
- లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
- అక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేయాలి.
- స్క్రీన్ పై ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ఫలితాల పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోండి.
Check AP Inter Supplementary Results 2025 Via Whatsapp :
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను వెబ్ సైట్ నుంచే కాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా చాలా సింపుల్ గా తెలుసుకోవచ్చు. వాట్సాప్ లో ఫలితాలు చెక్ చేసుకోవడం కోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి.
- ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోండి.
- AP Inter Supplementary Results 2025 ఆప్షప్ పై క్లిక్ చేయండి.
- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ ఫలితాలు స్క్రీన్ పై డిస్ ప్టే అవుతాయి. దీనిని పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోండి.