AWES APS Army Public School Recruitment 2025 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ జాబ్ కోసం ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్

AWES APS Army Public School Recruitment 2025 టీచర్ ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారతదేశమంతటా వివిధ కంటోన్మెంట్లు మరియు మిలిటరీ స్టేషన్లలో ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. TGT, PGT, PRT ఉద్యోగ నియామకాల కోసం ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్(OST) అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు జీవితాంతం చెల్లుబాటు అయ్యే స్కోర్ కార్డున అందుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూన్ 05వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

AWES APS Army Public School Recruitment 2025 Overview

నియామక సంస్థఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ(AWES)
పరీక్ష పేరుఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (AWES OST)
పరీక్ష ఉద్దేశ్యంఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో TGT, PGT, PRT పోస్టుల నియామక పరీక్ష

పోస్టుల వివరాలు : 

AWES APS Army Public School Recruitment 2025 నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు. ఇది ఒక ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ టెస్ట్ లో పాసైన్ వారికి లైఫ్ టైమ్ స్కోర్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు ద్వారా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో ఖాళీలు పడినప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అభ్యర్థులు విడివిడిగా వ్యక్తిగత పాఠశాలలకు దరఖాస్తు చేసుకోవాలి. 

అర్హతలు : 

పోస్టు పేరువిద్యార్హతప్రెఫెషనల్ క్వాలిఫికేషన్
PRT50 % మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ 50 % మార్కులతో B.Ed / D.Ed 
PGT50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ50% మార్కులతో  B.Ed
TGT50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ50% మార్కులతో  B.Ed
  • ఆన్ లైన్ స్కీనింగ్ టెస్ట్ హాజరు కావడానికి CTET / TET తప్పనిసరి కాదు. అయితే టీజీటీ / పీఆర్టీ అపాయింట్మెంట్ సమయంలో CTET / TET తప్పనిసరి. CTET / TET లో అర్హత పొందకపోయినా, ఇతర అన్ని అంశాల్లో అర్హులని తేలిన వారిని ఖాళీల్లో నియామకాలు చేసుకోవచ్చ. ఇవి అర్హత సాధించే వారకు తాత్కాలికంగా ఉండవచ్చు. 

వయస్సు : 

AWES APS Army Public School Recruitment 2025 ఏప్రిల్ 01, 2025 నాటికి  కింది అర్హతలు ఉండాలి. 

  •  కొత్త అభ్యర్థులు: 40 సంవత్సరాల మధ్య వయస్సు (బోధన అనుభవం లేని వారు).
  • అనుభవం ఉన్న వారు : 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న వారికి 55 సంవత్సరాల మధ్య వయస్సు  ఉండాలి.  

అప్లికేషన్ ఫీజు : 

AWES APS Army Public School Recruitment 2025 ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కి అప్లయ్ చేసే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.385/- ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ విధానంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

AWES APS Army Public School Recruitment 2025 అభ్యర్థులకు ఆన్ లైన్ స్కీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. 

ఆన్ లైన్ స్కీనింగ్ టెస్ట్(OST) : పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఒక తప్పు సమాధానికి  ¼ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ స్కోర్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. 

  • ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ విడివిడిగా నియామకాలు చేపట్టినప్పుడు అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు బోధనా నైపుణ్యం మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం : 

AWES APS Army Public School Recruitment 2025 ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కి అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05 జూన్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 ఆగస్టు, 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!